హీరో సంతోషకరమైన కన్నీళ్లు ఇవి!
ఇప్పుడా దంపతులకు కుమారుడు..కుమార్తె గలరు. తాజాగా 13వ వివాహ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టారు.
By: Tupaki Desk | 28 Aug 2023 8:20 AM GMTకోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కొచ్చి సక్సెస్ అయిన నటుడు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్రారంభమై అక్కడ నుంచి బుల్లి తెరపై పాపులర్ హోస్ట్ గా ఫేమస్ అయ్యాడు. అటుపై వెండి తెరకు ప్రమోట్ అయ్యాడు. ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన '3' సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత 'కేడీ బిల్లా కిలాడీ రంగ'..'మనం కోటి పక్షి' లాంటి విజయాలు ఖాతాలో వేసుకున్నాడు.
'రెమో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇటీవల రిలీజ్ అయిన 'మావీరన్' సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. శివ కార్తికేయన్ సక్సెస్ ఇలా నవతరం నటీనటులకు ఓ స్పూర్తి.
అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ..శివ కార్తికేయర్ అంటే ఎంతో ప్రేమ చూపిస్తారు. తన సక్సెస్ అయిన వైనం గురించి మాట్లాడుతుంటారు. శివకార్తీకేయన్ జర్నీ సాగుతోన్న సమయంలో ఆర్తిని వావాహం చేసుకున్నాడు.
ఇప్పుడా దంపతులకు కుమారుడు..కుమార్తె గలరు. తాజాగా 13వ వివాహ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి దిగిన ఫోటోల్ని శివ కార్తికేయన్ సోషల్ మీడియా వేదికగా అభిమాను లకు షేర్ చేసారు. అలాగే ఇవే నా సంతోషకరమైన కన్నీళ్లు అని రాసుకొచ్చారు. అందులో భార్య పిల్లలతో సరదగా ఆడుకుంటోన్న ఫోటోలు గమనించవచ్చు. సినిమాలు..కుటుంబమే జీవితం. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
షూటింగ్ ఉంటే సెట్లో ..లేదంటే ఇంట్లోనే ఉంటారు. పెద్ద స్టార్ అయిన చాలా సాధరణ జీవితాన్ని గడుపుతాడు. కోట్ల రూపాయాలు పారితోషికం తీసుకుంటున్నా నిరాడంబరంగా ఉంటాడు. ఆర్తి కూడా చాలా సింపుల్ గా ఉంటారు. సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తారు. సెలబ్రిటీ కుటుంబమైనా మోడ్రన్ దుస్తులకు చాలా దూరం. ఈ జంట పెళ్లి రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేడదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.