Begin typing your search above and press return to search.

హీరో నిర్మాతగా మరో ప్రయోగం..!

మన దగ్గర పరిస్థితి ఎలా ఉన్నా కోలీవుడ్ లో హీరోలు కొందరు తాము నటిస్తున్న సినిమాలతో పాటుగా నిర్మాతగా కూడా తమ మార్క్ చూపిస్తుంటారు

By:  Tupaki Desk   |   13 Aug 2024 2:30 PM GMT
హీరో నిర్మాతగా మరో ప్రయోగం..!
X

మన దగ్గర పరిస్థితి ఎలా ఉన్నా కోలీవుడ్ లో హీరోలు కొందరు తాము నటిస్తున్న సినిమాలతో పాటుగా నిర్మాతగా కూడా తమ మార్క్ చూపిస్తుంటారు. స్టార్ హీరో కమల్ హాసన్ నుంచి శివ కార్తికేయన్ వరకు అభిరుచి గల సినిమాల్లో నటించడం మాత్రమే కాదు నిర్మించడం కూడా చేస్తుంటారు. శివ కార్తికేయన్ మాత్రం వెరైటీ కథలతో నిర్మాతగా తన టేస్ట్ ని తెలియచేస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన నిర్మాతగా మరో ఇంట్రెస్టింగ్ సినిమా వస్తుంది. మొన్నటిదాకా కమెడియన్ గా చేస్తూ వచ్చిన సూరి లీడ్ రోల్ లో పి ఎస్ వినోద్ రాజ్ డైరెక్ట్ చేసిన సినిమా కొట్టుకళి.

మలయాళ భామ అన్నా బెన్ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ఇదేదో డిఫరెంట్ సినిమాగా ఉందనిపిస్తుంది. సినిమా స్టోరీ అంతగా రివీల్ చేయకపోయినా ఒక కోడి.. ఏదో ఆలోచనతో ఉండే అమ్మాయి.. ఒక ఊరి ఆరాధ్య దైవం ఇలా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా కేవలం ఒరిజినల్ సౌండ్ తో సినిమా చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా సినిమా అంటే అదో పెద్ద వింతేమి కాదు కానీ న్యాచురల్ సౌండ్స్ తో సినిమా చేయడం అన్నది ప్రయోగమే అని చెప్పొచ్చు. ఈ సినిమా ట్రైలర్ మరీ అంత గొప్పగా ఏం లేదు కానీ తమిళ ఆడియన్స్ ను మెప్పించేస్తుందని చెప్పొచ్చు. కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెప్పించిన అన్నా బెన్ పూర్తి స్థాయిలో చేసిన సినిమా ఇది.

కమెడియన్ సూరి కూడా వరుస సోలో సినిమాలతో మెప్పిస్తున్నాడు. ఐతే కథల ఎంపికలో కొత్తదనం చూపుతున్న సూరి తప్పకుండా ఈ ప్రయత్నాల్లో ఏదో ఒకటి సూపర్ హిట్ పడితే అతను కూడా రెగ్యులర్ హీరో క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక సైడ్ రోల్స్ నుంచి హీరోగా ప్రమోట్ అయ్యాడు కాబట్టి ఇలాంటి వారిని శివ కార్తికేయన్ సపోర్ట్ చేస్తున్నాడు. కొట్టుకళి సినిమా ఫలితం అటు నిర్మాతగా శివ కార్తికేయన్ కు.. హీరోగా సూరికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.