శివకార్తికేయన్ రేంజ్ కూడా గట్టిగానే..
శివకార్తికేయన్ సినిమా వస్తుంది అంటే ఇంటిల్లిపాది వెళ్లి చూడొచ్చు అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు
By: Tupaki Desk | 11 Feb 2024 5:11 AM GMTటాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా నానికి ఎంత మంచి ఇమేజ్ ఉందొ కోలీవుడ్ ఇండస్ట్రీలో శివ కార్తికేయన్ కి కూడా అలాంటి ఇమేజ్ ఉంది. ఆర్జేగా కెరియర్ స్టార్ట్ చేసిన శివకార్తికేయన్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత సోలో హీరోగా మారి ఒక్కో సక్సెస్ అందుకుంటూ ఎదుగుతూ వచ్చాడు. ప్రస్తుతం కోలీవుడ్ యువ హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
శివకార్తికేయన్ సినిమా వస్తుంది అంటే ఇంటిల్లిపాది వెళ్లి చూడొచ్చు అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఆయన సినిమాలలో కామెడీకి కొదవ ఉండదు. అది కూడా నేచురల్ కామెడీతో అతని కథలు ఉంటాయి. తాజాగా వచ్చిన అయలాన్ కూడా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా 83 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడం విశేషం.
శివకార్తికేయన్ చివరి ఐదు సినిమాలు చూసుకుంటే ఒక్క ప్రిన్స్ మాత్రమే ఫ్లాప్ అయ్యింది. మిగిలిన మూవీస్ అన్ని కూడా హిట్ అయ్యాయి. డాక్టర్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని లాంగ్ రన్ లో ఏకంగా 103 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. తరువాత వచ్చిన డాన్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏకంగా 122 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రిన్స్ ఫ్లాప్ టాక్ తో కూడా 44 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయడం విశేషం.
శివకార్తికేయన్ సూపర్ హీరోగా నటించిన మావీరన్ మూవీ 80.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు అయలాన్ 83 కోట్లు గ్రాస్ ని లాంగ్ రన్ లో అందుకుంది. ఆయన సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చిన కూడా 80 కోట్లకి పైనే కలెక్షన్స్ వస్తూ ఉన్నాయంటే శివకార్తికేయన్ మార్కెట్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కోలీవుడ్ లో ఇంత నిలకడగా కలెక్షన్స్ సాధిస్తున్న హీరో అంటే శివకార్తికేయన్ ఒక్కడే అని చెప్పాలి.
ఆయన సినిమాల కలెక్షన్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి
అయలాన్ - 83CR
మావీరన్ - 80.5CR
ప్రిన్స్ - 44CR
డాన్ - 122CR
డాక్టర్ - 103CR