ఐస్ బాక్స్ లో నాన్నను చూసి గుండె బద్దలైంది!
తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా శివ కార్తికేయన్ తండ్రి గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.
By: Tupaki Desk | 6 Nov 2024 9:03 AM GMTశివకార్తికేయన్ ఇప్పుడు కోలీవుడ్ లో ఎదుగుతోన్న హీరో. తెలుగులోనూ అతడికి మంచి గుర్తింపు దక్కుతోంది. సూర్య, కార్తి, విశాల్ లా ఫేమస్ అవుతున్నాడు. ఇప్పటికే అతడు నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులోనూ అనువా దమై మంచి విజయం సాధించాయి. ఇటీవలే `అమరన్` తో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీలో నటించి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.
ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ స్టోరీకే కమర్శియల్ టచప్ తో తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలు..ఆర్మీ బ్యాక్ డ్రాప్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తమిళ నటుడైనా శివ కార్తికేయన్ కి తెలుగు ఆడియన్స్ పట్టం కట్టారు. ఇప్పటికీ థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సస్ గా అమరన్ నిలిచింది.
ఈ చిత్రాన్ని స్వయంగా కమల్ హాసన్ నిర్మించడం మరో విశేషంగా చెప్పాలి.తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా శివ కార్తికేయన్ తండ్రి గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. `మా నాన్న నిజాయితీగల పోలీస్ అధికారి. అమరన్ లో ఆయననే చూసుకున్నాను. నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి అంబులెన్స్ బాక్స్ లో వచ్చారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆయన ఎముకలు మాత్రమే మిగిలాయి.
వాటిని చూసి నా గుండె బద్దలైంది. ఒక్కసారిగా అంతా శూన్యంగా కనిపించింది` అని అన్నారు. ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ ఒదిపోయాడు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన మేజర్ ముకుంద్. కొన్ని రోజుల్లోనే ఇంటికొస్తానని భార్య, పిల్లలతో చెప్పినా? ఇంతలోనే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయి వీర మరణం పొందారు.