Begin typing your search above and press return to search.

తెలుగు నిర్మాత చేతికి ముత్తయ్య బయోపిక్..!

అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ హక్కులను తెలుగు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 2:52 PM GMT
తెలుగు నిర్మాత చేతికి ముత్తయ్య బయోపిక్..!
X

మణికట్టు బౌలింగ్ తో మ్యాజిక్ చేసి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న శ్రీలంక మాజీ క్రికెటర్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథతో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. 800 టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను ఎం.ఎస్ శ్రీపతి డైరెక్ట్ చేశారు. అసలైతే మొదట ముత్తయ్య పాత్రకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతినే ఎంపిక చేశారు. కానీ కోలీవుడ్ ఆడియన్స్ నుంచి విపరీతమైన వ్యతిరేకత రావడం తో విజయ్ సేతుపతి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.

ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచింది. సినిమాలో లీడ్ రోల్ లో మధుర్ మిట్టల్ నటించారు. స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాలో నటించిన ఆయన ముత్తయ్య పాత్రకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యారు. ముత్తయ్య బయోపిక్ గా వస్తున్న 800 సినిమాను ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో వివేక్ రంగాచారి నిర్మించారు.

అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ హక్కులను తెలుగు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సొంతం చేసుకున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో బాలకృష్ణతో ఆదిత్య 369 సినిమా నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ నాని జెంటిల్మెన్, సమంతతో యశోద సినిమాలు చేశారు.

యశోద తర్వాత ఆయన మళ్లీ ముత్తయ్య బయోపిక్ గా వస్తున్న 800 సినిమా పాన్ ఇండియా హక్కులను తీసుకున్నారు. క్రికెటర్స్ బయోపిక్ లకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఆల్రెడీ ఎమ్మెస్ ధోనీ, సచిన్ టెండుల్కర్ జీవిత కథలతో సినిమాలు రాగా ఆ క్రమంలోనే శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య కథతో 800 సినిమా వస్తుంది. 800 సినిమాలో ముత్తయ్య ఎలా క్రికెటర్ గా మారాడు. అతని జీవితంలో జరిగిన వివిధ అంశాలను ప్రస్తావిస్తారని తెలుస్తుంది.

శ్రీలంక క్రికెటర్ అయినా కూడా ఇండియన్ క్రికెటర్స్ కి కూడా ముత్తయ్య అంటే ఒక మంచి స్పిన్నర్ అనే పేరు ఉంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా తను చేసే ప్రతి ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించే శివలెంక కృష్ణ ప్రసాద్ 800 సినిమాను రిలీజ్ చేయడం పై తెలుగులో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. 800 తమిళంలో తెరకెక్కుతుండగా సినిమాను సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.