Begin typing your search above and press return to search.

ఖుషి : నా పారితోషికం వార్తలకు అమ్మ షాక్

తాజాగా దర్శకుడు శివ నిర్వాణ పారితోషికం గురించి వస్తున్న పారితోషికం గురించి స్పందించాడు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 11:20 AM GMT
ఖుషి : నా పారితోషికం వార్తలకు అమ్మ షాక్
X

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్‌ గా నటించిన ఖుషి సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మించారని, ఈ సినిమాకు గాను హీరో, హీరోయిన్ మరియు దర్శకుడు రికార్డు స్థాయి పారితోషికం ను అందుకున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

కొన్ని మీడియా సంస్థలు మరియు సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్ పై విజయ్ దేవరకొండ రూ.23 కోట్లు, దర్శకుడు శివ నిర్వాన రూ.12 కోట్లు, హీరోయిన్‌ సమంత రూ.5 కోట్ల పారితోషికం అందుకుంది అంటూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వార్తల జోరు చూసి చాలా మంది ఈ పారితోషికాలు నిజమే అయి ఉంటాయని నమ్ముతున్నారు.

తాజాగా దర్శకుడు శివ నిర్వాణ పారితోషికం గురించి వస్తున్న పారితోషికం గురించి స్పందించాడు. మీడియాలో వస్తున్నట్లుగా తనకు రూ.12 కోట్ల పారితోషికం రావడం లేదని పేర్కొన్నాడు. మీడియాలో పారితోషికం గురించి వచ్చిన వార్తలు చూసి చాలా మంది షాక్ అయ్యి కాల్‌ చేస్తున్నారు. స్నేహితులు బాగానే సంపాదిస్తున్నావు అంటూ మెసేజ్ లు పెడుతున్నారు.

అమ్మ కూడా వార్తలు చూసి షాక్ అయ్యారు. నిజంగా అంత పారితోషికం తీసుకుంటున్నావా అంటూ ఫోన్ చేసి మరీ అడిగారు. చూడడానికి సైలెంట్ గా ఉంటావు గాని బాగానే పుచ్చుకుంటున్నావు అంటూ కొందరు సరదాగా నాతో వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి అంత పారితోషికం నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు.

హీరోకి, నాకు, ఇతర నటీనటులు టెక్నీషియన్ కు దాదాపుగా రూ.50 కోట్ల పారితోషికం ఇస్తే మేకింగ్‌ ఎలా జరుగుతుందని శివ నిర్వాన ప్రశ్నించాడు. అయితే ఎంత పారితోషికం తీసుకున్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. శివ నిర్వాన వ్యాఖ్యల తర్వాత కొత్త అంచనా పారితోషికం మళ్లీ ప్రచారం జరిగేనా చూడాలి.