పవన్ సర్ ఆ కథ నచ్చినా చేయనన్నారు..!
ఖుషి వంటి కథ తో పవన్ సర్ తో సినిమా తీయాలని ప్రత్యేకంగా కథను రాసుకున్నాను. పవన్ సర్ కోసం రాసుకున్న ఆ కథ ను వినిపించడం జరిగింది, సర్ కి కూడా ఆ కథ నచ్చింది.
By: Tupaki Desk | 17 Aug 2024 5:23 AM GMTపవన్ కళ్యాణ్ కెరీర్ లో పలు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో ఖుషి చిత్రం చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఎస్ జే సూర్య దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో పవన్ కు జోడీగా భూమిక నటించింది. అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా యూత్ లో పవన్ కళ్యాణ్ కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పవన్ స్టార్ డమ్ పై ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయాయి. ఖుషి కారణంగా పవన్ టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో చోటు చేసుకున్నాడు.
ఆ సినిమా ను రూపొందించిన దర్శకుడు ఎస్ జే సూర్య కొన్నాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి కథ వినిపించాడట. ఖుషి వంటి ప్రేమ కథ ను పవన్ కి వినిపించిన ఎస్ జే సూర్య ఆ సినిమాను చేయలేక పోయాడు. ఎస్ జే సూర్య చెప్పిన కథ నచ్చినా కూడా పవన్ ఆ సమయంలో చాలా బిజీగా ఉండటం వల్ల సినిమా చేయలేకపోయాడట. ఇటీవల ఎస్ జే సూర్య సరిపోదా శనివారం సినిమాలో నటించాడు. నాని నటించిన ఆ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ప్రమోషన్ లో భాగంగా ఎస్‌జే సూర్య మీడియాతో మాట్లాడుతూ అప్పటి విషయాలను వెళ్లడించాడు.
ఖుషి వంటి కథ తో పవన్ సర్ తో సినిమా తీయాలని ప్రత్యేకంగా కథను రాసుకున్నాను. పవన్ సర్ కోసం రాసుకున్న ఆ కథ ను వినిపించడం జరిగింది, సర్ కి కూడా ఆ కథ నచ్చింది. కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల డేట్లు ఇవ్వలేదు. కొన్నాళ్ల తర్వాత చూద్దాం అన్నట్లుగా ఆయన అన్నారు. ఇతర కమిట్‌మెంట్స్ మరియు ప్రాజెక్ట్స్ కారణంగా పవన్ సర్ తో నేను అనుకున్న సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. రెండేళ్ల క్రితం మళ్లీ అదే స్క్రిప్ట్ తో పవన్ సర్ తో సినిమాకు ప్రయత్నించాను. ఆ సమయంలో ప్రేమ కథలు చేసే ఉద్దేశం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
కథ నచ్చినా కూడా ప్రేమ కథలు చేసే ఉద్దేశ్యం లేదు అంటూ పవన్ సర్ నా కథను తిరస్కరించారు అంటూ ఎస్‌జే సూర్య చెప్పుకొచ్చాడు. వయసు రీత్యా పవన్ లవర్ బాయ్ ఇమేజ్ ఉండే సినిమాలకు నో చెప్పడం మంచి అభిప్రాయం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, మరి కొందరు మాత్రం పవన్ సర్ కోసం రెడీ చేసిన ఆ కథను అకీరా తో అయినా చేయాలని అంటున్నారు. మరి ఎస్ జే సూర్య ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తాడా అనేది చూడాలి. ఈ మధ్య కాలంలో ఎస్‌జే సూర్య దర్శకుడి కంటే కూడా ఎక్కువగా నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. కనుక ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తారా అంటే అనుమానమే అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.