గేమ్ చేంజర్.. దీనమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’.
By: Tupaki Desk | 21 Nov 2024 12:58 PM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్పీడ్ అందుకున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. దీపావళికి వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తదుపరి అప్డేట్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్న తరుణంలో.. డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్.జె. సూర్య తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించారు.
‘గేమ్ చేంజర్’ సినిమాలో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ''హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే 'గేమ్ ఛేంజర్'లోని రెండు కీలక సన్నివేశాల డబ్బింగ్ పూర్తి చేసాను. వాటిల్లో ఒకటి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో, మరొకటి శ్రీకాంత్ తో ఉండే సీన్స్. ఈ రెండు సీన్స్ డబ్బింగ్ పూర్తి చేయడానికి 3 రోజులు పట్టింది. 'దీనమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది' అనే విధంగా అవుట్ పుట్ వచ్చింది. థియేటర్లలో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయడాన్ని నేను ముందే చూస్తున్నాను. 'పోతారు మొత్తం పోతారు'. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్ కి, దిల్ రాజు గారు & టీమ్ కి ధన్యవాదాలు. ఇది రామ్'పింగ్ సంక్రాంతికి అవుతుంది. త్వరలో కలుద్దాం'' అని పేర్కొన్నారు.
'పోతారు మొత్తం పోతారు' అంటూ 'సరిపోదా శనివారం' సినిమాలోని డైలాగ్ తో ‘గేమ్ చేంజర్’ పై హైపెక్కించారు ఎస్.జె. సూర్య. ఆయన పోస్ట్ తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే, బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. రెండు సీన్స్ కు డబ్బింగ్ చెప్పడానికి మూడు రోజులు పట్టిందంటే శంకర్ ఎక్కడా రాజీ పడకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఎస్.జె. సూర్య ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథతో, శంకర్ మార్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘గేమ్ చేంజర్’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, నాజర్, సముద్రఖని, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆల్రెడీ ‘జరగండి..’ ‘రా మచ్చా మచ్చా’ పాటలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ గా ఓ మెలోడీని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందే 50వ సినిమా ఇది. దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘గేమ్ చేంజర్’ మూవీ విడుదల కానుంది.