Begin typing your search above and press return to search.

సూర్య భాయ్ కమిట్మెంట్ అదిరింది..!

ఐతే ఈ వేడుకలో పాల్గొనేందుకు ఎస్ జే సూర్య చాలా రిస్క్ తీసుకుని మరీ వచ్చినట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   6 Sep 2024 7:46 AM GMT
సూర్య భాయ్ కమిట్మెంట్ అదిరింది..!
X

దర్శకుడిగా మెప్పించి ఇప్పుడు నటుగా సత్తా చాటుతున్న ఎస్ జే సూర్య నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. సినిమాలో దయా పాత్రలో సూర్య నటన తెలుగు ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది. సరిపోదా శనివారం సక్సెస్ మీట్ గురువారం హైదరాబాద్ లో జరిగింది. నాని కెరీర్ 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సరిపోదా శనివారం విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఐతే ఈ వేడుకలో పాల్గొనేందుకు ఎస్ జే సూర్య చాలా రిస్క్ తీసుకుని మరీ వచ్చినట్టు తెలుస్తుంది.

సరిపోదా శనివారం సినిమా విజయోత్సవ సభకు రావాలని ఎస్ జే సూర్య మధురై లో ఒక సినిమా షూటింగ్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చారట. తను చేస్తున్న తమిళ సినిమాలో మంచి కాంబినేషన్స్ లో సీన్స్ ఉన్నా కూడా తెలుగు ఆడియన్స్ తన మీద చూపిస్తున్న ప్రేమకు థాంక్స్ చెప్పేందుకే వచ్చానని ఎస్ జే సూర్య వెల్లడించారు. ఇక ఈవెంట్ లో ఎస్ జే సూర్య స్పీచ్ కూడా అలరించింది.

కొన్ని యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా చేశామని.. రియల్ ఎమోషన్ ఉంటే బాగుంటుందని చెంప దెబ్బలు కూడా నిజంగానే తిన్నానని అన్నారు ఎస్ జే సూర్య. ఇదంతా మీరు చూపించే ప్రేమ కోసమే అని. సరిపోదా శనివారం లాంటి సినిమా చేయడం లక్కీగా ఫీల్ అవుతున్నా తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఎస్ జే సూర్య.

ఎస్ జే సూర్య అంతకుముందు మహేష్ మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ సినిమాలో విలన్ గా చేశారు. ఐతే తమిళ దర్శకుడు కాబట్టి విలన్ గా ఆయన్ను తీసుకున్నారని అనుకున్నారు. కోలీవుడ్ లో విలన్ గా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న ఎస్ జే సూర్య తెలుగులో మాత్రం సరిపోదా శనివారంతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇదే కాదు శంకర్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఆయన ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమా ఎఫెక్ట్ కచ్చితంగా గేమ్ చేంజర్ మీద ఉంటుందని చెప్పొచ్చు. ఇదే ఈవెంట్ లో గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు కూడా ఎస్ జే సూర్య యాక్టింగ్ ఆ సినిమాలో కూడా పేపర్స్ వేసేలా ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ లో అంచనాలు పెంచారు.