Begin typing your search above and press return to search.

ఎస్ జె సూర్య డామినేషన్.. నాని ఏమన్నాడంటే..

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ గురువారం రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   1 Sep 2024 5:10 AM GMT
ఎస్ జె సూర్య డామినేషన్.. నాని ఏమన్నాడంటే..
X

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ గురువారం రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే 50 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకొని సక్సెస్ ఫుల్ గా ఈ చిత్రం దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతున్న కూడా సరిపోదా శనివారం సినిమాకి అద్భుతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఓవర్సీస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని ఈ చిత్రం అందుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరో పాత్ర కంటే విలన్ క్యారెక్టర్ కి ఎక్కువ ప్రశంసలు లభిస్తున్నాయి. ఇన్ స్పెక్టర్ దయ క్యారెక్టర్ లో ఎస్ జె సూర్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నాని చేసిన క్యారెక్టర్ కూడా దయ పాత్ర కంటే తక్కువగానే ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఈ విషయంపై మూవీ సక్సెస్ మీట్ లో జర్నలిస్ట్స్ నానిని అడిగారు. సరిపోదా శనివారం సినిమాలో మీ కంటే ఎస్ జె సూర్య చేసిన క్యారెక్టర్ గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది.

సినిమా చూసిన తర్వాత ఎస్ జె సూర్య క్యారెక్టర్ గురించి ఎక్కువ వినిపిస్తోంది. సూర్య లేకపోతే ఈ సినిమా లేదని అంటున్నారు. మీరు కూడా ఎస్ జె సూర్య క్యారెక్టర్ గురించి ప్రమోషన్స్ లో హైలైట్ చేస్తూ వస్తున్నారు. అసలు ఈ క్యారెక్టర్ అతన్ని వెతుక్కుంటూ ఎలా వెళ్లిందని అడిగారు. దానిపై నాని క్లారిటీ ఇచ్చారు. సరిపోదా శనివారం ఇచ్చిన గ్రేటెస్ట్ హై ఏంటంటే నా సినిమా సూపర్ హిట్ అంటున్నారు. నా కంటే ఎక్కువగా సూర్య గురించి మాట్లాడుతున్నారు.

ఇది కచ్చితంగా నేను బెస్ట్ ప్రశంసగా తీసుకుంటాను. ఇది నాకు చాలా స్పెషల్ మెమొరీ. సక్సెస్ లు కొత్త కాదు. కానీ సరిపోదా శనివారం మాత్రం స్పెషల్. నేను కథ విన్నప్పుడే ఇది సూర్య సినిమా కాదు దయ సినిమా అని నమ్మాను. సెట్ లో కూడా వివేక్ కి ఎప్పుడు చెబుతూ ఇదే విషయం చెబుతూ ఉండేవాడిని. వివేక్ ఆత్రేయ దయ క్యారెక్టర్ ని రాసిన విధానం, దానిని సూర్య ప్లే చేసిన విధానం చూస్తే ఆన్ స్క్రీన్ పై ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తుంది.

అది ఈ సినిమాకి హైలైట్ అంటూ నాని సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్ హీరో అయిన కూడా దయ క్యారెక్టర్ చాలా ప్రత్యేకం అని నాని ప్రశంసించారు. దయలాంటి క్యారెక్టర్ కి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఎస్ జె సూర్య ప్రాణం పోసాడనే మాట సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు. నాని కూడా దయ క్యారెక్టర్ గురించి, ఆ పాత్రలో సూర్య పెర్ఫర్మెన్స్ గురించి మీడియా ముఖంగా గొప్పగా చెప్పడం నిజంగా విశేషం.