చెర్రీ ఫాన్స్ కి క్రేజీ అప్డేట్ ఇచ్చిన SJ సూర్య..
చిరుత మూవీతో మెగాస్టార్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు రామ్ చరణ్
By: Tupaki Desk | 5 July 2024 5:17 AM GMTచిరుత మూవీతో మెగాస్టార్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు వరల్డ్ వైడ్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు శంకర్ డైరెక్షన్‌లో అతను గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని కారణాలవల్ల షూటింగ్ వాయిదా పడడంతో ఈ చిత్రం అనుకున్న టైం కంటే ఆలస్యంగా విడుదలవుతుంది..
2021 లో శంకర్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీ ప్రారంభించారు. ఈ మూవీ షూటింగ్ తో పాటుగా కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీ షూటింగ్ కూడా చేస్తూ రావడంతో చెర్రీ సినిమా షూటింగ్ బాగా ఆలస్యమైంది. నిజానికి లాస్ట్ ఇయర్ ఈ చిత్రం విడుదలవుతుంది అని అతని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే ఇంకా షూటింగ్ మిగిలి ఉండడంతో చిత్రం విడుదల వాయిదా పడింది.
శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ తో పాటు మిగిలిన అన్ని పనులు పూర్తయిపోయాయి. జులై 12న ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ పనులతో ఫుల్ బిజీగా ఉన్న శంకర్ ఇకపై తన పూర్తి ఫోకస్ రామ్ చరణ్ చిత్రంపై పెట్టబోతున్నారు. దీంతో ఈ మూవీ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి అని చెర్రీ అభిమానులు ఎంతో ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు.
రీసెంట్ గా భారతీయుడు 2 చిత్రంలో విలన్ గా నటించినా SJ సూర్య ప్రమోషన్స్ లో చెర్రీ ఫాన్స్ కి ఓ మంచి న్యూస్ అందించారు.భారతీయుడు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవిలో ప్రధాన విలన్ గా అతనికి అవకాశం రామ్ చరణ్ చిత్రం వల్లే వచ్చింది అన్న విషయాన్ని సూర్యా స్టేజిపై వెల్లడించారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్‌లో కూడా సూర్య కీలక పాత్ర చేస్తున్నారు.
ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను నటించిన కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత శంకర్ అతన్ని భారతీయుడు 2 లో ప్రధాన విలన్ గా చేయమని అడిగారట. అలా రామ్ చరణ్ మూవీ వల్ల అతనికి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ రోల్ దొరికిందని సూర్య వెల్లడించారు. ఇక గేమ్ ఛేంజర్ మూవీ విషయానికి వస్తే షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది.. భారతీయుడు 2 మూవీ విడుదల తర్వాత ఈ చిత్రం మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.