భారతీయుడు 2 హడావుడిలో పవన్ కళ్యాణ్ సౌండ్
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు 2లో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటించాడు.
By: Tupaki Desk | 8 July 2024 4:31 AM GMTఒకప్పుడు దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య ప్రస్తుతం ప్రతినాయకుడిగా భిన్నమైన పాత్రలు చేస్తూ నటుడిగా దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోల సినిమాలలో మంచి మంచి పాత్రలు చేస్తూ బెస్ట్ యాక్టర్ అనిపించుకుంటున్నాడు. సూర్య పెర్ఫార్మెన్స్ కి, సంభషణలు పలికే విధానానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు 2లో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటించాడు.
తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో సూర్య మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సమాజంలో అవినీతిపై ప్రశ్నించే ప్రతి ఒక్కరిలో భారతీయుడు ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఉన్న మీలో కూడా ఒక ఇండియన్ ఉన్నాడని అన్నారు. అదే సమయంలో నేను చూసిన వారిలో నా స్నేహితుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో ఒక భారతీయుడు కనిపిస్తాడని ప్రశంసించారు.
ఆ మాటకి ఆడిటోరియం మొత్తం రీసౌండ్ రావడం విశేషం. మూడేళ్ళ క్రితం ఒక మాట చెప్పాను. ఏదో ఒక రోజు నా స్నేహితుడు ఏపీ ముఖ్యమంత్రి అని అందరికి చెప్పుకుంటా అని అన్నారు. ఈ రోజు సగం నిజం అయ్యింది. ఏపీకి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. భవిష్యత్తులో సీఎం కచ్చితంగా అవుతారు. దానిని చేయడం మీ చేతుల్లోనే ఉంది అంటూ సూర్య ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అలాగే భారతీయుడు ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఎస్.జె.సూర్య పవన్ కళ్యాణ్ కి ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో కొమరం పులి మూవీ తెరకెక్కింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. సూర్య కూడా ఆ చిత్రం తర్వాత దర్శకత్వంకి దూరంగా ఉంటూ యాక్టర్ గా రానిస్తున్నారు.
ఇదిలా ఉంటే భారతీయుడు 2 మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. భారతీయుడు సినిమాలో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ అందరికి చేరువ అయిపోయాడు. కరప్షన్ మీద తెరకెక్కిన సినిమాలకి భారతీయుడు ఒక ఇనిస్పిరేషన్ అని చెప్పాలి. అలాంటి సేనాపతి మరల 28 ఏళ్ళ తర్వాత భారతీయుడు 2 ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మరి ఈ సారి ప్రేక్షకుల నుంచి మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందనేది వేచి చూడాలి.