Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం.. హీరో గుట్టు విప్పిన SJ సూర్య

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ ఆగష్టు 29న థియేటర్స్ లోకి రాబోతోంది.

By:  Tupaki Desk   |   8 Aug 2024 4:07 AM GMT
సరిపోదా శనివారం.. హీరో గుట్టు విప్పిన SJ సూర్య
X

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ ఆగష్టు 29న థియేటర్స్ లోకి రాబోతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కమర్షియల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు, టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. వీటికి పర్వాలేదనే టాక్ వచ్చింది.

సినిమా బిజినెస్ కూడా ఆల్ మోస్ట్ అయిపోయిందంట. నాని వరుసగా రెండు సూపర్ హిట్స్ తర్వాత సరిపోదా శనివారంతో థియేటర్స్ లోకి వస్తున్నారు. దీంతో మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ హెవీగానే ఉన్నాయి. నాని కథల ఎంపిక పెర్ఫెక్ట్ గా ఉంటుందనే అభిప్రాయం పబ్లిక్ లో ఉంది. ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా చేసింది. ఎస్.జె.సూర్య పాత్ర క్రూయల్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటుందంట.

వారం రోజుల కోపాన్ని కేవలం శనివారం మాత్రమే చూపించే వాడిగా నాని ఈ చిత్రంలో కనిపించబోతున్నాడంట. అసలు అలా ఎలా చూపిస్తాడు. ఎందుకు ఒక్క రోజు మాత్రమే చూపించాల్సి వచ్చింది. అతని రివేంజ్ ఎలా ఉంటుందనేది కథనంతో వివేక్ ఆత్రేయ చాలా ఇంటరెస్టింగ్ గా ఈ మూవీ స్టోరీని చెప్పబోతున్నారంట. ఇదిలా ఉంటే తాజాగా ఎస్.జె.సూర్య ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ కథని కొంత వరకు రివీల్ చేసేసారు. చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉంటూ అన్నింటికి కోపాన్ని ప్రదర్శించే నానిని కంట్రోల్ చేయడానికి అతని తల్లి ఒక ఆలోచన చేస్తుంది.

వారం రోజులు వచ్చిన కోపాన్ని మనసులో దాచుకో… దానిని ఒక రోజు చూపించేసే అని సలహా ఇస్తుంది. నాని క్యారెక్టర్ తల్లి చెప్పిన ఆ మాటని మనసుకి తీసుకొని అలాగే చేయడం మొదలుపెడతాడు. అలా వారం రోజులు వచ్చిన కోపాన్ని శనివారం రోజు హీరో చూపించే ప్రయత్నం చేస్తాడని సూర్య సదరు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే సూర్య మూవీ స్టోరీ మొత్తం రివీల్ చేసాడని ఈ ఇంటర్వ్యూ వీడియోపై సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

టైటిల్ తో పాటు టీజర్ లోనే ఈ కథని చెప్పేసారు కదా… మూవీలో మహా అయితే మొదటి 10 నిమిషాలు మాత్రమే ఈ స్టోరీ లైన్ ఉంటుంది. తరువాత అంతా కథనం ఉంటుంది. అలాంటి ఒకే రోజు కోపాన్ని చూపించేవాడు తన చుట్టూ జరిగే సంఘటనలకి ఎలా రియాక్ట్ అవుతాడనేది చెప్పడమే మెయిన్ స్టోరీగా ఉంటుందని మరికొంత మంది అంటున్నారు.