స్కంద బాక్సాఫీస్.. పెరిగిన సండే లెక్క
సెప్టెంబర్ 28న రిలీజైన ఈ చిత్రం మంచి టాక్‌తోనే వెళ్తోంది. వసూళ్లను కూడా బాగానే అందుకుంటోంది. నాలుగు రోజు ఆదివారం కావడంతో సినిమా మంచి వసూళ్లు వచ్చాయి.
By: Tupaki Desk | 2 Oct 2023 6:10 AM GMTఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన మాస్ యాక్షన్ బ్లాస్ట్ ఎంటర్టైనర్ మూవీ 'స్కంద'. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్‌గా తెరకెక్కింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సెప్టెంబర్ 28న రిలీజైన ఈ చిత్రం మంచి టాక్‌తోనే వెళ్తోంది. వసూళ్లను కూడా బాగానే అందుకుంటోంది. నాలుగు రోజు ఆదివారం కావడంతో సినిమా మంచి వసూళ్లు వచ్చాయి.
మూడో రోజుతో పాలిస్తే నాలుగో రోజు ఎక్కువ కలెక్షన్స్‌ను ఖాతాలో వేసుకుంది. నాలుగో రోజు వసూళ్ల వివరాల విషయానికొస్తే.. నైజాంలో రూ. 1.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, వైజాగ్‌లో రూ.51 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలు వచ్చాయి. అంటే నాలుగో రోజు మొత్తం కలిపి రూ. 4.54 కోట్ల షేర్ వచ్చాయి.
మొత్తంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజుల్లో కలిపి మంచి వసూళ్లే వచ్చాయి. రెస్పాన్సే వచ్చింది. నైజాంలో రూ. 8.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.87 కోట్లు, వైజాగ్‌లో రూ. 2.48 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.46 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 96 లక్షలు, గుంటూరులో రూ. 1.98 కోట్లు, కృష్ణాలో రూ. 1.04 కోట్లు, నెల్లూరులో రూ. 88 లక్షలతో కలిపి.. రూ. 19.91 కోట్ల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఈ రోజుతో మళ్లీ వర్కిండ్ డేస్ ప్రారంభమైన నేపథ్యంలో వసూళ్ల ఎలా వస్తాయనేది చూడాలి. ఎంత కాదనుకున్నా కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. వచ్చే వీకెండ్ వరకు కాస్త బ్యాలెన్స్డగా వసూళ్లను అందుకుంటూ పోతే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను త్వరగానే పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఎలాంటి వసూళ్లు వస్తాయో.
కాగా, ఈ సినిమాలో యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కథనాయికగా నటించింది. సయీ మంజ్రేకర్, సీనియర్ నటుడు శ్రీకాంత్, ఇంద్రజ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, లోహితాశ్య తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్ తన మార్క్ సెన్సేషన్ మ్యూజిక్ అందించారు.