స్కంద మాస్ మేకింగ్.. మూవీటీమ్ ఎంతలా కష్టపడిందంటే
ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ థండరింగ్ బ్లాక్ బాస్టర్‌గా థియేటర్లలో ప్రదర్శితమవుతోందని చెబుతూ.. స్కంద మాస్ మేకింగ్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసింది.
By: Tupaki Desk | 30 Sep 2023 12:48 PM GMTబోయపాటి సినిమాలంటేనే హై వోల్టేజ్ యాక్షన్ సరుకు. ఇప్పుడాయన మార్క్ యాక్షన్‌కు రామ్ పోతినేని ఎనర్జీకి-శ్రీలీల గ్లామర్ తోడై వచ్చిన సినిమా స్కంద. బాక్సాఫీస్ ముందు మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్లను కూడా మంచిగానే వస్తున్నాయి. సినిమా చూసిన అభిమానులు ఒక్క రివ్యూలో రామ్ మాస్ రాంపేజ్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ప్రస్తుతం మూవీటీమ్ సక్సెస్ జోష్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ థండరింగ్ బ్లాక్ బాస్టర్‌గా థియేటర్లలో ప్రదర్శితమవుతోందని చెబుతూ.. స్కంద మాస్ మేకింగ్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసింది. హై అక్టేన్ యాక్షన్, ఫన్, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్సెస్, ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం టీమ్ మొత్తం ఎంతంగా శ్రమించిందో ఈ గ్లింప్స్‌లో చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
1.54 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో.. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు, బాలయ్య సెట్స్‌ను సందర్శించిన సన్నివేశాలు, రామ్ పోతినేనితో పాటు ఇతర తారాగణంపై చిత్రీకరించిన సన్నివేశాల మేకింగ్‌ను చూపించారు. బోయపాటి తన సినిమాలోని నటీనటులకు సన్నివేశాలను వివరిస్తూ చిత్రీకరిస్తున్న సీన్స్‌ను చూపించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ జరిగిన మెయిన్స్ సీన్స్ అన్నింటినీ జోడించారు. ఈ వీడియోకు 'లా కొడితే.. వేటపులి దూకితే' అంటూ సాగే పవర్ ఫుల్ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేసి వదిలారు. ఈ మేకింగ్ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.
ఇక ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే.. రామ్ పోతినేని నటన, డ్యాన్స్, బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్, యాక్షన్, ఎమోషనల్ డ్రామా సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. తమన్ అందించిన మ్యూజిక్ కూడా హైలైట్‌గా ఉంది. అక్కడక్కడా రొటీన్‌గా అనిపించే సన్నివేశాలు సినిమాకు కాస్త మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. స‌్కంద మాస్ జాతర అని చెప్పొచ్చు.
సినిమాలో రామ్, శ్రీలీలతో పాటు సయీ మంజ్రేకర్, ప్రిన్స్ సిసిల్, శరత్ లోహితాశ్వ, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎస్. తమన్ - సంగీతం, తమ్మిరాజు - ఎడిటింగ్, సంతోష్ దేటేక్ - సినిమాటోగ్రఫీ అందించారు. సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.