స్కంద.. ఇవెక్కడి ప్రాఫిట్స్ బాబోయ్
స్కంద నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే నిర్మాతకి 90 కోట్ల వరకు వచ్చిందంట. ఇదంతా కూడా మూవీకి వచ్చిన లాభాలే అని చెప్పాలి
By: Tupaki Desk | 31 Aug 2023 5:14 AM GMTరామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ స్కంద. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతోంది. భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తోంది. రామ్ పోతినేని కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
బోయపాటి సినిమాలు ఇష్టపడేవారికి స్కంద ఫుల్ మీల్స్ లా ఉండబోతోందని ట్రైలర్ తో స్పష్టం అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కూడా ప్రేక్షకులకి బాగా రీచ్ అయ్యాయి. తమన్ సంగీతం స్కంద మూవీకి బూస్టింగ్ అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా థీయాట్రికల్ బిజినెస్ 50 కోట్ల వరకు జరిగినట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నాన్ థీయాట్రికల్ రైట్స్ గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
స్కంద నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే నిర్మాతకి 90 కోట్ల వరకు వచ్చిందంట. ఇదంతా కూడా మూవీకి వచ్చిన లాభాలే అని చెప్పాలి. సౌత్ భాషల డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. వీటికోసం ఏకంగా 54 కోట్ల రూపాయిలు చెల్లించిందంట. అలాగే హిందీ డిజిటల్, శాటిలైట్, థీయాట్రికల్ రైట్స్ ని 35 కోట్లకి జీ స్టూడియోస్ దక్కించుకుంది.
ఈ సినిమా నిర్మాణంలో జీ స్టూడియోస్ కూడా భాగస్వామిగా ఉంది. ఈ కారణంగానే హిందీకి సంబందించిన అన్ని రైట్స్ ని వారు సొంతం చేసుకున్నారు. ఇలా థియేటర్స్ లో పడకుండా స్కంద సినిమా ఏకంగా 90 కోట్ల వరకు నిర్మాతకి తెచ్చిపెట్టింది. ఇక సౌత్ థీయాట్రికల్ రైట్స్ తో కలుపుకుంటే 140 కోట్ల వరకు ఈ సినిమాపై బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితుల మాట.
రామ్ పోతినేని కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ స్కంద మూవీకి జరిగిందని దీనిని బట్టి తెలుస్తోంది. సినిమాపై రామ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మాస్ హీరోగా తనకి ఈ చిత్రం పెర్ఫెక్ట్ ఎలివేషన్ అవుతుందని భావిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల, సాయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ లాంటి యాక్టర్స్ ఇతర కీలక పాత్రలలో కనిపిస్తున్నారు.