ఏపీలో 'స్కంద' పొలిటికల్ కాక రేపుతుందా!
ఈ నేపథ్యంలో తాజాగా 'స్కంద'లో రామ్ తోనూ బోయపాటి అలాంటి పంచ్ డైలాగులు పేల్చే అవకాశం ఉందని వినిపిస్తోంది.
By: Tupaki Desk | 26 Sep 2023 5:08 AM GMTఏపీలో రాజకీయ వాతావరణం ఏ రేంజ్ లో వెడెక్కిందో తెలిసిందే. కొన్ని నెలలు గా పొలిటికల్ కాక కొనసాగుతుంది. తాజా పరిస్థితులు ఏపీలో అంతకంతకు కాక పుట్టిస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్యనే రిలీజ్ అయిన 'బ్రో 'సినిమాలో పృథ్వీరాజ్ పాత్ర మంత్రి అంబటి రాంబాబుని పోలి ఉందని ఎంతటి రచ్చకు దారి తీసిందో తెలిసిందే. ఈ పంచాయతీ ఏకంగా ఢిల్లీ వరకూ చేరింది. చివరకు ఎలాగూ వివాదం సద్దు మణిగింది అనుకోండి.
మరి మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న 'స్కంద' కూడా రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉందా? అంటే అవుననే డిస్కషన్ సాగుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్-బోయపాటి కాంబినేషన్ లో 'స్కంద' తెరకెక్కిన సంగతి తెలిసిందే. సాధారణంగా బోయపాటి సినిమాలో పంచ్ డైలాగులు చర్చనీయాంశం అవుతుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా! అందులో బాలయ్య నటిస్తే అది రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది.
బాలయ్య రాజకీయాల్లో ఉన్నా? లేకపోయినా ఆయన చెప్పే పంచ్ డైలాగులు ప్రత్యర్ధికి తగిలేలా ఉంటాయన్నది తెలిసిందే. 'లెజెండ్'..'అఖండ'..'సరైనోడు' లాంటి చిత్రాల్లో కొన్ని పంచ్ డైలాగులు రాజకీయ ప్రత్యర్ధులపైననేనా అని గతంలో డిస్కషన్స్ సాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా 'స్కంద'లో రామ్ తోనూ బోయపాటి అలాంటి పంచ్ డైలాగులు పేల్చే అవకాశం ఉందని వినిపిస్తోంది.
ప్రస్తుత పాలక పక్షంపైనా ఈ ద్వయం తమదైన శైలి డైలుగులతో కాక పుట్టిస్తారని గెస్సింగ్స్ తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఓ పాత్ర ఓ ఫేమస్ ప్రత్యర్ధి పొలిటిషయన్ ని గుర్తు చేసేలా ఉంటుందిట. ఆ పాత్ర డైలాగులు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారుతాయని అంటున్నారు.
అవి ఒక్కసారిగా అర్ధం కానప్పటికీ స్లో పాయిజన్ లా జనాల్లోకి వెళ్తాయని గుస గుస వినిపిస్తోంది. ఏపీలో తాజా పరిస్థితుల నేపథ్యంతో ఈ ఇద్దరు కూడా లో లోపల చాలా సీరియస్ గానే ఉన్నారని..తమవైపు నుంచి సంఘీభావాన్ని తమ సినిమా ద్వారా తెలిజయజేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏపీలో 'స్కంద' ఎలాంటా ప్రకంపనలు రేపుతుందో చూడాలి.