సలార్ డేట్ దొరికితే సరిపోదు స్కంద
సెప్టెంబర్ 15 డేట్ పై మొదటి నుంచి కూడా చిత్ర యూనిట్ పెద్దగా సంతృప్తి అయితే చెందడం లేదు.
By: Tupaki Desk | 4 Sep 2023 4:09 PM GMTరామ్ పోతినేని బోయపాటి కాంబినేషన్లో తెరపైకి రాబోతున్న స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయాలని మొత్తం కూడా సిద్ధం చేసుకున్నారు కానీ ప్లాన్ చేంజ్ అయ్యింది. బోయపాటి రెండు వారాల క్రితమే టైం ప్రకారం కంటెంట్ మొత్తం కూడా రెడీ చేసి నిర్మాత ముందు పెట్టేసాడు. ఇక నిర్మాత కూడా రిలీజ్ హడావిడి మొదలుపెట్టేశారు. ఒకవైపు సాంగ్స్ విడుదల చేస్తూనే మరొకవైపు పోస్టర్స్ తో కూడా కాస్త బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.
అయితే సెప్టెంబర్ 15 డేట్ పై మొదటి నుంచి కూడా చిత్ర యూనిట్ పెద్దగా సంతృప్తి అయితే చెందడం లేదు. ఆ తర్వాత రిలీజ్ చేద్దాం అంటే పోటీ కాస్త ఎక్కువగా ఉండటంతో ఎటు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తానికి బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ సలార్ వెనుకడుగు వేయడంతో ఆ డేట్ కు రావడం బెటర్ అని స్కంద టీం డిసైడ్ అయింది.
ఇక సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్ గా స్కందా సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇది కలిసొచ్చే అంశమే అయినప్పటికీ కూడా స్కంద సినిమా పై ఇప్పటివరకు కూడా అనుకున్నంత స్థాయిలో అయితే అంచనాలు పెరగలేదు. రెగ్యులర్ రొటీన్ మాస్ కమర్షియల్ కంటెంట్ తోనే బోయపాటి రాబోతున్నాడు అని ఇప్పటివరకు వచ్చిన టీజర్ ట్రైలర్స్ చెప్పకనే చెప్పేశాయి.
దానికి తోడు ట్రైలర్లో కొన్ని సీన్స్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. ఇటీవల కాలంలో మాస్ కమర్షియల్ సినిమాలు కాస్త డివైడ్ టాక్ అందుకున్నా దారుణంగా నష్టాలను కలుగజేస్తున్నాయి. అయితే ఈ సినిమా సాంగ్స్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఆకట్టుకోలేదు. తమన్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా రెస్పాన్స్ అయితే రావడం లేదు.
సలార్ డేట్ అయితే దొరికింది కానీ దానికి కావాల్సిన అంత బజ్ మాత్రం ఇప్పటివరకు స్కంద క్రియేట్ చేయలేకపోయింది. అయితే చిత్ర యూనిట్ కి ఈ విషయం తెలియకుండా ఉండదు కాబట్టి మళ్లీ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే విధంగా ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేశారు. మరొక పవర్ఫుల్ ట్రైలర్ విడుదల చేయాలి అని డిసైడ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ట్రైలర్ను నెక్స్ట్ వారంలో విడుదల చేసి రామ్ తో పాటు హీరోయిన్ శ్రీలీలతో కూడా ప్రమోషన్స్ చేయించాలి అని డిసైడ్ అయ్యారు. మరి ఈసారి ఎంతలా హైప్ పెంచుతారో చూడాలి.