Begin typing your search above and press return to search.

స్కంద‌ ట్రైల‌ర్: సంపేట‌ప్పుడు వాని త‌ల‌కాయ ఏడుందో సూస్తా

స్కంద పూర్తి మాస్ యాక్ష‌న్ సినిమా. ఇందులో రొమాన్స్ ఫన్ స‌హా ప్ర‌తిదీ ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని ట్రైల‌ర్ చెబుతోంది. అఖండ త‌ర‌హా భ‌క్తి ర‌సం తెర‌పై అల‌రించ‌నుంది.

By:  Tupaki Desk   |   25 Sep 2023 5:14 PM GMT
స్కంద‌ ట్రైల‌ర్: సంపేట‌ప్పుడు వాని త‌ల‌కాయ ఏడుందో సూస్తా
X

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని (రాపో) క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'స్కంద'. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కుడు. ఈ సినిమా టీజ‌ర్, థియేట్రికల్ ట్రైలర్ ల‌కు అద్భుత స్పందన వ‌చ్చింది. బోయ‌పాటి మార్క్ మాస్ సినిమా ఇద‌ని ట్రైల‌ర్ తో వెల్ల‌డైంది.ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో సినిమా విడుద‌ల కానుంది. తాజాగా ఈరోజు సినిమా 'రిలీజ్ ట్రైలర్‌'ని విడుద‌ల‌ చేశారు. ట్రైల‌ర్ ఆద్యంతం మాస్ యాక్ష‌న్, డైలాగ్స్ తో ర‌క్తి క‌ట్టిస్తోంది. ముఖ్యంగా రామ్ ఎన‌ర్జీ లెవ‌ల్స్ ని బోయ‌పాటి వంద‌శాతం ఉప‌యోగించుకున్నాడ‌ని ట్రైల‌ర్ వెల్ల‌డిస్తోంది.

స్కంద పూర్తి మాస్ యాక్ష‌న్ సినిమా. ఇందులో రొమాన్స్ ఫన్ స‌హా ప్ర‌తిదీ ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని ట్రైల‌ర్ చెబుతోంది. అఖండ త‌ర‌హా భ‌క్తి ర‌సం తెర‌పై అల‌రించ‌నుంది. ముఖ్యంగా ఇందులో రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రికి కాబోయే అల్లుడిగా రామ్ పరిచయం అయ్యే సన్నివేశం ఆక‌ట్టుకుంది. రామ్ పూర్తి మాసీగా ర‌ఫ్ అండ్ ర‌గ్గ్ డ్ గా భారీ డైలాగ్స్ తో ఊచ‌కోత‌తో కొత్తగా క‌నిపిస్తున్నాడు. రామ్ లోని యాక్ష‌న్ కోణాన్ని బోయ‌పాటి వంద‌శాతం బ‌య‌టికి తీసాడ‌నే ట్రైల‌ర్ తో అర్థ‌మ‌వుతోంది.

ట్రైల‌ర్ ఆద్యంతం రామ్ భారీ యాక్ష‌న్ సీన్స్ లో ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. అత‌డి డైలాగులు ఎంతో ప‌వ‌ర్ ఫుల్ గా ఉన్నాయి. ఇందులో శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ట్రైల‌ర్ మాస్ లోకి దూసుకెళుతోంది. ఇక సినిమా ఆద్యంతం యాక్షన్ స్టైల్ లో బోయపాటి మార్క్ కనిపిస్తుంది. ఎస్.ఎస్ థమన్ మ‌రోసారి అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని పెంచుతున్నాడు. సంతోష్ కెమెరా ప‌నిత‌నం అద‌న‌పు అస్సెట్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ రాజీ లేకుండా ఈ చిత్రానికి పెట్టుబ‌డుల్ని స‌మ‌కూర్చింది. సినిమా థియేట్రికల్ విడుదలకు మూడు రోజుల ముందు రిలీజ్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఇది ఓపెనింగుల‌కు అద‌న‌పు బూస్ట్ ఇస్తుంద‌ని అంతా భావిస్తున్నారు.