స్కంద..బోయ బజ్ బాగానే ఉంది కానీ..
కానీ ఈ తరహా మాస్ కంటెంట్ మరి టూ మచ్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరిస్థితిని కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
By: Tupaki Desk | 28 Aug 2023 8:36 AM GMTబోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా చేస్తున్న మొదటి సినిమా స్కంద సెప్టెంబర్ 15వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది అనే విషయంలో బోయపాటి పెద్దగా సస్పెన్స్ అయితే క్రియేట్ చేయలేదు. పక్క ఊర మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అని ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కూడా మాస్ ఎలిమెంట్స్ తోనే హైలెట్ చేశారు.
అందులో విలన్స్ ను హీరో ఊచకోత కోయడం గట్టిగానే వైరల్ అవుతుంది. బోయపాటి స్టైల్ ఎలా ఉంటుందో మరోసారి వెండితెరపై కనిపించబోతోంది అని అర్థమవుతుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ బోయపాటి బాలయ్య బాబుతో ఇలాంటి ఊరమాస్ సినిమాలు చేసే బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. కానీ మిగతా హీరోలతో మాత్రం ఆయన అనుకున్నంత స్థాయిలో అయితే సెన్సేషన్ క్రియేట్ చేయలేదు.
అల్లు అర్జున్ తో మాత్రం సరైనోడుతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే సింహ లెజెండ్ అఖండ సినిమాలకు ఉన్న ఫ్యాన్ బేస్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బోయపాటి అంటేనే బాలయ్య కాంబినేషన్ అనేలా ఆ సినిమాలు గుర్తుచేస్తాయి. అయితే ఇప్పుడు స్కంద ట్రైలర్ కు రెస్పాన్స్ అయితే గట్టిగానే వచ్చినట్లు అర్థమవుతుంది.
24 గంటల్లోనే రెండు పదుల మిలియన్ల వ్యూవ్స్ దాటిన ఈ ట్రైలర్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ అయితే ఏర్పరచుకోబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ తరహా మాస్ కంటెంట్ మరి టూ మచ్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరిస్థితిని కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో ప్రముఖ దర్శకులు కూడా కమర్షియల్ ఫార్మాట్ లో డిజాస్టర్ అందుకుంటే చాలా దారుణంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇక బోయపాటి వీలైనంతవరకు మాస్ ఎలిమెంట్స్ తోనే సినిమాను కాపాడాలని చూస్తాడు. స్కంద ట్రైలర్ చేసిన తర్వాత రొటీన్ బోయపాటి ఫార్ములా అనే విధంగా కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ట్రైలర్ కు మాత్రం వ్యూవ్స్ అయితే గట్టిగానే వచ్చాయి. ఇక ఒక వైపు నెగిటివ్ కామెంట్స్ మరోవైపు ట్రైలర్ కు అద్భుతమైన స్పందన, ఈ తరహా వాతావరణంలో సినిమా కంటెంట్ క్లిక్ అయితేనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తాయిమ్ మరి బోయపాటి వెండితెరపై ఎలాంటి కంటెంట్ ను చూపిస్తాడో చూడాలి.