'లక్కీ భాస్కర్' - కంటెంట్ కి తగ్గ కలెక్షన్లు రాలేదు!
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'బేబీ' నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమా కలెక్షన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 22 Dec 2024 12:30 AM GMTదుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్కీ భాస్కర్' ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా 110 కోట్లకి పైగా కలెక్షన్స్ ని బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు చేసింది. అదే సమయంలో రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం 'క' మూవీ కూడా 50 కోట్ల వరకు వసూళ్లు చేసింది. అయితే 'లక్కీ భాస్కర్' మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకుంది. ఈ దశాబ్దంలో వచ్చిన బెస్ట్ సినిమాలలో ఈ చిత్రం కూడా ఒకటనే మాట వినిపించింది.
దుల్కర్ సల్మాన్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఈ మూవీ నిలిచింది. 'సీతారామం' కంటే ఎక్కువ వసూళ్లు ఈ సినిమాకి రావడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'బేబీ' నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమా కలెక్షన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'లక్కీ భాస్కర్' కి వచ్చిన రెస్పాన్స్ తో పోల్చుకుంటే కలెక్షన్స్ చాలా తక్కువ అని అన్నారు.
'లక్కీ భాస్కర్' కంటెంట్ పొటన్షియల్ కి సరిపోయే కలెక్షన్స్ రాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలంలో థియేటర్స్ లో సినిమాలు చూసే ఆడియన్స్ బాగా తగ్గిపోయారు. ఈ కారణంగానే సినిమాకి వచ్చిన రెస్పాన్స్ కి తగ్గ కలెక్షన్స్ రావడం లేదనిపిస్తోందని ఎస్కేఎన్ అన్నారు. ఇండస్ట్రీలో చాలా మందికి ఈ అభిప్రాయం ఉంది. మేగ్జిమమ్ స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఓ రెండు, మూడు వారాలు థియేటర్స్ లో కొనసాగుతున్నాయి.
మీడియం రేంజ్ హీరోల సినిమాలకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కూడా కలెక్షన్స్ భారీగా రావడం లేదు. ఓ పదిరోజుల పాటు థియేటర్స్ కి ఆడియన్స్ వస్తున్నారు. తరువాత గణనీయంగా తగ్గిపోతున్నారు. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు వీకెండ్ వరకే ప్రభావం చూపిస్తున్నాయి. తరువాత థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. 20-30 రోజుల్లోనే సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయడం కోసం థియేటర్స్ ఆడియన్స్ తగ్గడానికి ఒక కారణంగా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
థియేటర్స్ లో రిలీజ్ చేసిన తర్వాత ఓటీటీలో విడుదల చేయడానికి మినిమమ్ 8 వారాల గడువు ఉంటే బెటర్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో థియేటర్స్ ఆడియన్స్ మరింత తగ్గే అవకాశం ఉందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరి థియేటర్స్ లో ప్రేక్షకులని పెంచడానికి మున్ముందు మేకర్స్ ఎలాంటి ఆలోచనలు చేస్తారనేది వేచి చూడాలి.