Begin typing your search above and press return to search.

'క' కిరణ్ ఆవేదన.. ఎస్కేఎన్ హార్ట్ బ్రేక్!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీ రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Nov 2024 11:29 AM GMT
క కిరణ్ ఆవేదన.. ఎస్కేఎన్ హార్ట్ బ్రేక్!
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీ రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. కొత్త డైరెక్టర్స్ సుజీత్, సందీప్ దర్శకత్వం వహించగా.. కిరణ్ కు జోడీగా నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ అయిన ఆ సినిమా.. ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చి ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది.

అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధిస్తోంది 'క' మూవీ. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులకు గాను రూ.13 కోట్లకు పైగా వసూలు చేసింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అయితే పాన్ ఇండియాలో రూపొందిన 'క' మూవీ.. తెలుగులో మాత్రమే విడుదలైంది. కొన్ని కారణాల వల్ల మిగతా భాషల్లో రిలీజ్ అవ్వలేదు. త్వరలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

అయితే తమిళనాడులోని చెన్నైలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అనేక మంది ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో వారి కోసం అక్కడ తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నట్లు రీసెంట్ గా కిరణ్ అబ్బవరం తెలిపారు. 'క' సినిమా మంచి హిట్ అవ్వడంతో మేకర్స్.. శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఫ్యాన్స్ కు థ్యాంక్స్ తెలిపారు. ఆ సమయంలో చెన్నైలో తెలుగు వెర్షన్ రిలీజ్ గురించి మాట్లాడారు కిరణ్ అబ్బవరం.

"చెన్నై నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు. అంత పెద్ద హిట్ అయిన 'క' మూవీని చెన్నైలో ఎందుకు చూడలేకపోతున్నామని వారు అడుగుతున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. దీంతో ఒక్క ఐదు షోలు లేక పది షోలు వేయమని అడుగుతున్నాను. ఐదు షోలు చాలా అంటున్నా. చూసే వాళ్ళు చూస్తారు. ఇదంతా తెలుగు వెర్షన్ కోసమే.. తమిళ వెర్షన్ కోసం కాదు.. మరెప్పుడు రిలీజ్ చేస్తారో" అని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

దీంతో అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. అదే సమయంలో బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా రెస్పాండ్ అయ్యారు. మన తెలుగు ప్రేక్షకులు.. అన్ని భాషల చిత్రాలతోపాటు సొంత సినిమాలు కూడా ఇష్టపడతారని అన్నారు. కానీ కొన్నిసార్లు మన చిత్రాలకు ఇతరుల నుంచి కనీస మర్యాద లభించకపోతే జీర్ణించుకోవడానికి చాలా బాధగా ఉందని తెలిపారు. హార్ట్ బ్రేక్ సింబల్ ను యాడ్ చేశారు. కిరణ్ మాట్లాడిన వీడియోను కూడా రీ షేర్ చేశారు.