Begin typing your search above and press return to search.

బేబీ సీన్స్​పై పోలీసుల నోటీసు​.. SKN ఏమన్నారంటే?

కాగా, అంతకుముందు సీపీ సీవీ ఆనంద్‌ ప్రెస్ మీట్​లో మాట్లాడుతూ.. "బేబీ చిత్రంలో డ్రగ్స్ ఎలా ఉపయోగించాలో చూపించారు.

By:  Tupaki Desk   |   14 Sep 2023 4:03 PM GMT
బేబీ సీన్స్​పై పోలీసుల నోటీసు​.. SKN ఏమన్నారంటే?
X

బేబీ చిత్రంలో డ్రగ్స్​ను ప్రోత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయని, వినియోగదారులు డ్రగ్స్​ను ఏవిధంగా ఉపయోగించాలనే దృశ్యాలను చిత్రంలో చూపించారంటూ.. సదరు చిత్ర నిర్మాతలకు నోటిసులు ఇవ్వనున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపిన సంగతి తెలిసిందే. మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న, వినియోగిస్తున్న ముఠాను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన సీవీ ఆనంద్‌ ఈ విషయాన్ని తెలిపారు. బేబీ సినిమా దర్శకనిర్మాతలు ఎస్​కేన్​, సాయిరాజేశ్​ను పిలిపించి ఈ విషయం గురించి మాట్లాడారు.

అయితే ఈ విషయంపై నిర్మాత ఎస్​కేన్​ సోషల్​మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. "ఈ సినిమాపై ఎటువంటి లీగ్​ కేసు పెట్టడాం కానీ యాక్షన్ తీసుకోవడం గానీ జరగలేదు. అడ్వైసరి నోటీసులు ఇచ్చారు. అలాంటి సన్నివేశాలు పెట్టొద్దని సూచించారు. గౌరవనీయులైన సీపీగారుతో మీటింగ్ సవ్యంగా సాగింది." అని నిర్మాత పేర్కొన్నారు.

ఈ విషయంపై దర్శకుడు సాయి రాజేశ్ కూడా వివరణ ఇచ్చారు. బేబీ చిత్రంలో డ్రగ్స్ సన్నివేశాలను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పోలీసు అధికారులు వివరణ అడిగి తెలుసుకున్నారు. "కథలో భాగంగానే డ్రగ్స్‌ సీన్​ పెట్టాము అని పోలీసులకు వివరణ ఇచ్చాను. ఇలాంటి సీన్స్​ మాదాపూర్ డ్రగ్స్ కేసులో బయటకు వచ్చాయని పోలీసులు చెప్పారు. ప్రజలకు ఆదర్శంగా ఉండేలా చిత్రాలు చేయాలని అడ్వైస్ ఇచ్చారు. టాలీవుడ్ పరిశ్రమకు ఈ విషయాలను తెలియజేయాలని విజ్ఞప్తిచేశారు. అడ్వైజరీ నోటీస్ ఇచ్చారు" అని సాయి రాజేశ్‌ క్లారిటీ ఇచ్చారు.

కాగా, అంతకుముందు సీపీ సీవీ ఆనంద్‌ ప్రెస్ మీట్​లో మాట్లాడుతూ.. "బేబీ చిత్రంలో డ్రగ్స్ ఎలా ఉపయోగించాలో చూపించారు. ఇలాంటి సీన్స్​ చిత్రీకరించవద్దని చిత్ర పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తున్నాను. బేబీ చిత్ర నిర్మాతలకు కూడా నోటీసులు ఇస్తాము. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుంది" అని అన్నారు.

ఇకపోతే బేబీ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం యూత్​కు బాగా కనెక్ట్ అయింది. ప్రేమ విషయంలో యువత ఆలోచన, ఉండే విధానం ఎలా ఉందో చూపించారు.