ఐస్ ముక్క కోసం ఎస్కేఎన్ అండ్ కో!
మరి ఈ సినిమా ద్వారా నిర్మాత ఎస్ కె.ఎన్ ఎంత లాభపడ్డాడు? అంటే ఆయన సమాధానం చాలా నిరు త్సాహంగానే కనిపిస్తుంది.
By: Tupaki Desk | 30 Jan 2024 11:31 AM GMTగతేడాది రిలీజ్ అయిన బేబి ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా సంచలన విజయం నమోదు చేసింది. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. కంటెంట్ పై నెగిటివిటీ హైలైట్ అయినప్పటికీ సక్సెస్ లో కొట్టుకుపోయింది. ఆ సినిమా నటీ నటులకు.. దర్శకుడిని...నిర్మాతకి అందరికీ మంచి పేరుతో పాటు డబ్బు కూడా తీసుకొచ్చింది.
మరి ఈ సినిమా ద్వారా నిర్మాత ఎస్ కె.ఎన్ ఎంత లాభపడ్డాడు? అంటే ఆయన సమాధానం చాలా నిరు త్సాహంగానే కనిపిస్తుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఆయనకేం పెద్దగా ఒరగడం లేదన్నట్లే చెప్పుకొచ్చాడు. బేబి 100 కోట్లు తెచ్చింది. అందులో లాభాలు ఏం చేసారు? అని ఓ ప్రశ్న వేసారు మీడియా ప్రతినిధులు..దానికి ఎస్కేఎన్ ఇలా బధులిచ్చాడు. నాతో కమిట్ చేయించి లేనిపోని ట్యాక్స్ లు కట్టించేలా ఉన్నారే.
బేబి కలెక్షన్ల ఫిగర్ పోస్టర్ల మీదనే ఇంది. ఇకా నా అకౌంట్ లోకి రాలేదు. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్ల నుండి ఇంకా రావాల్సి ఉంది. `సలార్` లెక్క.. `గుంటూరు కారం` వసూళ్ల లెక్క తేలిన తర్వాత మా లెక్క తేలు తుంది. అయితే రావాల్సిన అమౌంట్ గ్రాస్ ఒక్కటే. అందులో షేర్ ఉంటుందని...ఐస్ ముక్కలా అది చేతులు మారి వచ్చేసరికి ఎంత కరిగిపోతుందో తెలియదు. ఆ ముక్క కోసం వెయిట్ చేస్తున్నాం`అన్నాడు.
అలాగే `బేబి` చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు ఎస్ కె.ఎన్ తెలిపాడు. మరి అక్కడ ఏ హీరోని తీసుకుంటారు? దర్శకుడిగా బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? అన్నది చూడాలి. ప్రస్తుతం ఎస్ .కె. ఎన్ - డైరెక్టర్ మారుతి తమిళ సినిమా `ట్రూ లవర్` ను తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇద్దరు ఆసినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.