Begin typing your search above and press return to search.

వేణు స్వామి జైలుకు వెళ్తారా లేదా..!

ఆల్రెడీ ఈమధ్యనే ఫిల్మ్ జర్నలిస్ట్ తరపున మహిళా కమిషన్ కు వేణు స్వామి గురించి ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు నేడు పోలీసులకు కూడా తమ ఫిర్యాదు అందించారు.

By:  Tupaki Desk   |   20 Aug 2024 4:46 PM GMT
వేణు స్వామి జైలుకు వెళ్తారా లేదా..!
X

ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి కొద్ది గంటల క్రితం మూర్తి ఇంకా కొంతమంది జర్నలిస్టులు 5 కోట్లు ఇవ్వమని అడుగుతున్నారని ఒక వీడియోని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై జర్నలిస్ట్ మూర్తి రెస్పాండ్ అవుతూ ఎటాక్ చేశాడు. వేణు స్వామి ఆయన సతీమణి శ్రీవాణికి కూడా తాను తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అని ప్రజలకు చెప్పారు. ఐతే వేణు స్వామి ఇలా జర్నలిస్టుల మీద వీడియో తీయడంపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చింది. ఆల్రెడీ ఈమధ్యనే ఫిల్మ్ జర్నలిస్ట్ తరపున మహిళా కమిషన్ కు వేణు స్వామి గురించి ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు నేడు పోలీసులకు కూడా తమ ఫిర్యాదు అందించారు.

ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు జర్నలిస్టులు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో ఒకప్పుడు ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ నిర్మాత SKN కూడా పాల్గొన్నారు. వేణు స్వామి గారంటే తనకు ఇష్టమని ఆయన ఏదైతే చెబుతాడో అది జరగకుండా దానికి రివర్స్ జరుగుతుందని అన్నారు. వేణు స్వామి చేసే కామెడీ అంటే తనకు ఇష్టమని. మన జర్నలిస్టులు ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఈసారి ఆయనతో స్కిట్ చేయిద్దామని అనుకున్నానని అన్నారు.

ఐతే వేణు స్వామి ఇన్నాళ్లు కామెడీగా అవన్ని చేస్తున్నాడని అనుకోగా ఆయన తన పాపులారిటీ పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నారని ఈమధ్యనే అర్ధమైందని. సెలబ్రిటీస్ గురించి ఆయన చేస్తున్న కామెంట్స్, చెబుతున్న జోతిష్యం కొంతమందిని ఇబ్బంది పెడుతున్నాయని. ఇప్పుడు లేటేస్ట్ గా జర్నలిస్టులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అంటున్నారని. జర్నలిస్టులకు మెయిల్ చేయడానికే టైం లేదని ఇక బ్లాక్ మెయిల్ ఎలా చేస్తారని అన్నారు SKN.

అంతేకాదు సెలబ్రిటీస్ మీద ఎవరో ఒకరు ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇవాళ వేణు స్వామి రేపు రామస్వామి అని ఎవరెవరో వస్తారు. ఐతే వేణు స్వామి జాతకం ఆయన గురించి కూడా చెప్పుకోవాలని.. నెక్స్ట్ వేణు స్వామి జైలుకు వెళ్తారా లేదా.. ఫ్యాన్స్ ఆయన్ను కొడతారా లేదా అని అంచనా వేయాలని అన్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటే బాగుంటుందని మీడియా, పరిశ్రమ రెస్పాండ్ అవ్వడం మొదలైతే పరిస్థితి వేరేలా ఉంటుందని అన్నారు.