Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత‌త కోసం పూరి చెప్పిన టెక్నిక్!

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో యూట్యూబ్ లో స్పెష‌ల్ విడియోలు రిలీజ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Nov 2024 8:30 AM GMT
ప్ర‌శాంత‌త కోసం పూరి చెప్పిన టెక్నిక్!
X

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో యూ ట్యూబ్ లో స్పెష‌ల్ విడియోలు రిలీజ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాను ఎంపిక చేసుకున్న అంశంపై త‌న‌దైన శైలిలో విశ్లేషించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఇప్ప‌టికే ఎన్నో విష‌యాల్ని పంచుకున్న పూరి తాజాగా స్లో లైఫ్ గురించి చెప్పుకొచ్చారు. ఇది ఉరుకుల ప‌రుగ‌ల జీవితాన్ని గ‌డిపే వారికి బాగా క‌నెక్ట్ అవుతుంది. `ప్ర‌స్తుతం మ‌న‌మంతా ప‌రుగులు పెడుతూ బ‌తుకుతున్నాం. ప్ర‌తీ రోజు డెడ్ లైన్స్ ఉంటాయి. మ‌ల్టీ టాస్క్ ల‌తో ఊపిరాడ‌కుండా ప‌రిగెడ‌తాం.

స్టో లైఫ్ అనేది లైఫ స్టైల్ ఫిలాస‌ఫీ. దాన‌ర్దం కంగారు ప‌డ‌కుండా నెమ్మ‌దిగా ఆస్వాదిస్తూ ప‌నిచేయ‌డం. ఉద‌యాన్నే మంచంపై నుంచి ఉలిక్కి ప‌డి లేవ‌డం, వెంట‌నే బాత్ రూమ్ లోకి దూర‌డం. త‌ర్వాత వీధిలోకి వెళ్లిపోవ‌డం కాదు. మెల్ల‌గా లేచి కాల‌కృత్యాలు తీసుకుని వీలైతే గంట యోగా చేసి, కాస్త విరామం తీసుకుని బ్రేక్ పాస్ట్ చేసి ప‌నికి బ‌య‌ల్దేరండి. ప్ర‌తీ ప‌నికి దానికి ఇవ్వాల్సిన స‌మ‌యం ఇచ్చి దాన్ని ఆస్వాదించాలి. ప‌ది సెక‌న్ల‌లో ప‌ళ్లు తోమ‌డం.. రెండు నిమిషాల్లో స్నానం చేయ‌డం, నాలుగు గంట‌లే నిద్ర‌పోవ‌డం మానేయాలి.

అలా చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి ఎక్కువ‌వుతంది. ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తే ప్ర‌శాంతంగా ఉండ‌గ‌లుగుతారు. లైఫ్ స్లోగా ఉండ‌టం వ‌ల్ల మీ కుటుంబం బంధాలు బ‌ల‌ప‌డ‌తాయి. ఫ్యామిలీతో కాసేపైనా ప్ర‌శాంతంగా కూర్చోగ‌లిగితే ఒక‌రికొక‌రు అర్ద‌మ‌వుతారు. అది మాత్ర‌మే కాదు. మీ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ప‌రీక్ష‌లు బాగా రాస్తారు. మైండ్ స‌రిగ్గా లేకుండా ఎంత పరుగు పెట్టినా ఉప‌యోగం లేదు. స్లో లైఫ్ వ‌ల్ల ప్ర‌తీ నిమిషాన్ని ఆస్వాదించొచ్చు. దాని కోసం ఔట్ డోర్ లో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పండి. నాణ్య‌త కోసం ప్ర‌య‌త్నించండి. అన‌వ‌స‌ర‌మైన‌వ‌న్నీ క‌ట్ చేస్తే మంచిది.

వంట చేయ‌డానికి, తిన‌డానికి కాస్త స‌మ‌యం ఇవ్వండి. కాసేపు కుక్క‌తో ఆడుకోండి. అప్పుడ‌ప్పుడు మీ ఆలోచ‌న‌లు కాగితంపై పెట్టండి. కాసేపు న‌డ‌వండి. సైకిల్ తొక్కండి. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌నం బ‌తికే రోజులు పెర‌గ‌కపోయినా? ఉన్న రోజులైనా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండ‌గ‌లం. ఇది అంద‌రూ చేయ‌లేరు. డ‌బ్బున్న వారు తేలిక‌గా చేయ‌గ‌ల‌రు. డ‌బ్బు లేని వారికి ఇవ‌న్నీ చేయ‌గ‌ల‌మా? అనే సందేహం వ‌స్తుంది. గంట లేదా రెండు గంట‌లు ముందే నిద్ర లేస్తే చేయోచ్చు` అని అన్నారు.