Begin typing your search above and press return to search.

ఈవారం బాక్సాఫీస్.. పరిస్థితి ఎలా ఉందంటే..

సినిమా థియేటర్లు మళ్లీ వెలవెలబోతున్నాయి. పొంగల్ భరిలో నిలబడిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం ఏ స్థాయిలో లాభాలు అందించిందో.

By:  Tupaki Desk   |   21 Feb 2025 6:09 AM GMT
ఈవారం బాక్సాఫీస్.. పరిస్థితి ఎలా ఉందంటే..
X

సినిమా థియేటర్లు మళ్లీ వెలవెలబోతున్నాయి. పొంగల్ భరిలో నిలబడిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం ఏ స్థాయిలో లాభాలు అందించిందో.ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ హడావుడి ముగిసిన తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌కి గట్టి హిట్ అందే పరిస్థితి ఇంకా కనిపించడంలేదు. గేమ్ ఛేంజర్ లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ కూడా ఈ ఏడాది ఆరంభంలోనే ఎదురవ్వడం షాకింగ్. ఇక సంక్రాంతికి వస్తున్నాం తరువాత మళ్ళీ ‘తండేల్’ కాస్త బజ్‌ క్రియేట్ చేసి మంచి కలెక్షన్స్ రాబట్టింది.

ఇక తండేల్ లాభల్లోకి వచ్చిన అనంతరం మళ్ళీ ఆ రేంజ్ లో కూడా ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపించేలా కనిపించడం లేదు. ఇటీవల వచ్చిన విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా ఆశించిన స్థాయి రాబట్టలేక, బాక్సాఫీస్‌కి మరో షాక్ ఇచ్చింది. ఇక ఈ శుక్రవారం నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వాటి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

ఈవారం సినిమాల వివరాల్లోకి వెళితే.. కమెడియన్ నటరాజ్ దర్శకత్వంలో వచ్చిన సముద్రఖని నటించిన 'రామం రాఘవం' ట్రైలర్ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. సముద్రఖని నటనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నా, ఈ సినిమా ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద ఏమి చేయగలదో చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా, థియేటర్లలో కూర్చునే ప్రేక్షకుడికి ఏదైనా ప్రత్యేకమైన ఆకర్షణ లేకపోతే, ఈ సినిమాకు కష్టమే.ఈ సినిమా ప్రచారం కూడా లేకపోవడం తో రిలీజ్ అవ్వుతుంది అనే విషయమే తెలియదు.

ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో కాస్త ఆసక్తిని రేపుతున్న వాటిలో ప్రదీప్ రంగనాధన్ నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈ స్టార్ కు మంచి క్రేజ్ దక్కింది. ఇక సినిమాకు కాస్త బజ్ ఉంది. కానీ, ఈ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా ఉందా? అన్నది ఈ రోజు తెలుస్తుంది వెయిట్ ఫర్ తుపాకీ రివ్యూ.

ఇక మిగతా వాటిలో ఏదైనా బాక్సాఫీస్‌ను కదిలించేలా ఉందా? అంటే… సమాధానం 'లేదు' అని చెప్పాల్సిన స్థితి. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన 'బాపు' మాత్రమే కాస్త తెలుగులో గుర్తింపు పొందిన ప్రాజెక్ట్. బలగం లాంటి కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ, ఈ సినిమాకి సరైన హైప్ లేకపోవడంతో, ప్రమోషన్లు కూడా సరిగ్గా జరగకపోవడం వల్ల బాక్సాఫీస్ బరిలో నిలబడగల అవకాశాలను తక్కువ చేస్తోంది.

ఇక తమిళ నటుడు ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జబిలమ్మ నీకు అంత కోపం’ గురించి అయితే చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఆయన డబ్బింగ్ సినిమాలు పెద్దగా హైప్ లేకుండా రిలీజ్ అవుతాయి. ఈ సినిమా కూడా అదే ట్రాక్‌లో ఉంది. ధనుష్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, సరైన ప్రచారం లేకపోతే సినిమా నిలబడటం చాలా కష్టమే. ఇక సినిమాకు పబ్లిక్ అండ్ క్రిటిక్స్ నుంచి అబౌ యావరేజ్ అనే టాక్ వినిపిస్తోంది.తుపాకీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

మొత్తంగా చూస్తే, ఈ వారం కూడా బాక్సాఫీస్‌కు పెద్ద ఊపు వచ్చేలా లేదు. కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేంత క్రేజ్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో, టాలీవుడ్ మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సినిమాలు ఫైనల్ గా ఎలా ఉన్నాయో పూర్తి రివ్యూలలో తెలుసుకుందాం.