Begin typing your search above and press return to search.

చిన్న సినిమాల డిమాండ్ పెరిగిందోచ్..!

ఈమధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు వాటి ఫలితాలు ఇండస్ట్రీ పెద్దలను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 Jan 2024 2:30 PM GMT
చిన్న సినిమాల డిమాండ్ పెరిగిందోచ్..!
X

స్టార్ సినిమాలతోనే ఇండస్ట్రీ ప్రస్థానం మరింత స్థాయికి వెళ్తున్నా ఆ సినిమాలకు తోడుగా చిన్న సినిమాలు అదే చిన్న బడ్జెట్ సినిమాల ప్రభావం కూడా పరిశ్రమ మనుగడకు సహకరిస్తుందని చెప్పొచ్చు. కోట్ల కొద్దీ బడ్జెట్.. స్టార్ హీరోల డేట్స్ ఇవన్ని ఏవి అవసరం లేకుండానే లో బడ్జెట్ తో సినిమాలు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు నేటి తరం యువ మేకర్స్. సినిమా తీయాలంటే ఆ స్టార్ కావాలి.. ఆ డైరెక్టర్ కుదరాలి.. అక్కడ లొకేషన్స్ చూడాలి అన్నది కాకుండా ముందు సరైన కంటెంట్ ఉంటే చాలని ప్రూవ్ చేస్తున్నారు.

ఈమధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు వాటి ఫలితాలు ఇండస్ట్రీ పెద్దలను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్ పెట్టి వాటి ప్రమోషన్స్ కి మరికొన్ని కోట్లు పెట్టడం కన్నా సరైన కంటెంట్ తో లో బడ్జెట్ తో సినిమాలు చేస్తే అద్భుతాలు సృష్టించ వచ్చని తెలిసేలా చేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన హనుమాన్ దీనికి సరైన ఉదాహరణ.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా 27 కోట్ల బడ్జెట్ తో తీయగా ఇప్పుడు 300 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తుంది. తెలుగులో లో బడ్జెట్ సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టినా అవి 100 కోట్ల దగ్గర ఆగిపోయాయి. కానీ హనుమాన్ 300 కోట్లు సాధించడం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కన్నడ, మలయాళంలో ఇలా లో బడ్జెట్ అంటే 20 కోట్ల లోనే సినిమాలు తీసి అద్భుత విజయాలు అందుకుంటారు.

రెండేళ్ల క్రితం వచ్చిన కాంతారా సినిమా 16 కోట్లతో తెరకెక్కించగా 400 కోట్లను వసూలు చేసింది. సో కంటెంట్ మ్యాటర్ కానీ అందులో స్టార్ ఉన్నాడా డైరెక్టర్ స్టార్ డైరెక్టరా అన్నది ఆడియన్స్ చూడట్లేదు. అందుకే చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో కూడా చిన్న సినిమాల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెరిగింది. చిన్న సినిమాల మీద డిమాండ్ పెరగడంతో బడా ప్రొడ్యూసర్స్ కూడా మంచి కథ దొరికితే చాలు లో బడ్జెట్ లో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇది సినిమా పరిశ్రమకు మంచి పరిణామమని చెప్పొచ్చు. అప్ కమింగ్ రైటర్స్, యువ దర్శకులకు కూడా ఇది మంచి ప్రోత్సాహకరమని చెప్పొచ్చు.