Begin typing your search above and press return to search.

థియేట‌ర్ల ప్ర‌ధాన ఆదాయం అదేనా?

ఇవే స్నాక్స్ థియేట‌ర్లో రెట్టింపు చేసి అమ్ముతున్నారు. టికెట్లు తెగ‌క‌పోయినా...థియేట‌ర్ కి వెళ్లిన ప్ర‌తీ ఒక్క‌రూ స్నాక్న్ తీసుకుంటే చాలు ఖాళీగా ఉన్న సీటు ధ‌ర‌లు ఫిల్ అయిన‌ట్లే.

By:  Tupaki Desk   |   21 May 2024 6:00 AM GMT
థియేట‌ర్ల ప్ర‌ధాన ఆదాయం అదేనా?
X

ఆన్ లైన్ లో సినిమా టికెట్ బుక్ చేయ‌డం మ్యాట‌ర్ కాదు. థియేట‌ర్ కి వెళ్లిన త‌ర్వాత అక్క‌డ పాప్ కార్న్ కోక్ కొన్నామా? అన్న‌ది మ్యాట‌ర్. ఎందుంక‌టే టికెట్ ధ‌ర‌కంటే స్నాక్స్ ధ‌ర చూస్తేనే దిమ్మ‌తిరిగిపోతుంది. ఫ్యామిలీతో సినిమా కెళ్లాలంటే మిడిల్ క్లాస్ మ్యానే కాదు..అప్ప‌ర్ క్లాస్ మ్యాన్ కూడా అక్క‌డ షాక్ అవ్వాల్సిన ప‌రిస్థితే. కొంత‌కాలంగా య‌ధేశ్చగా మ‌ల్లీప్లెక్స్ లో స్నాక్స్ రూపంలో ఈ ర‌క‌మైన దోపిడి జ‌రుగుతోంది.

ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ధ‌ర‌ల ప‌ట్టిక కొన్ని చోట్ల పెడుతున్నారు? మ‌రికొన్ని చోట్ల ఎలాంటి డిస్ ప్లే లు లేకుండానే అడిగినంత చెల్లించుకోవాల్సిందే. తాజాగా కొన్ని గ‌ణాంకాల ప్ర‌కారం థియేట‌ర్ల లాభాలు చూస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం. టిక్కెట్ల విక్రయాల కంటే చిరుతిళ్లు ఎక్కువ డబ్బును తెచ్చిపెడుతున్నాయని మ‌రోసారి తేలింది. సాధార‌ణంగా థియేట‌ర్లో అందుబాటులో ఉండే చిరుతిళ్లు అదే బ‌య‌ట విక్ర‌యిస్తే సగం ధ‌ర‌కే వ‌స్తాయి.

ఇవే స్నాక్స్ థియేట‌ర్లో రెట్టింపు చేసి అమ్ముతున్నారు. టికెట్లు తెగ‌క‌పోయినా...థియేట‌ర్ కి వెళ్లిన ప్ర‌తీ ఒక్క‌రూ స్నాక్న్ తీసుకుంటే చాలు ఖాళీగా ఉన్న సీటు ధ‌ర‌లు ఫిల్ అయిన‌ట్లే. భారతదేశంలో అగ్రశ్రేణి మల్టీప్లెక్స్ చైన్ అయిన పీవీర్ ఐనాక్స్ నుండి వచ్చిన నివేదికల ప్ర‌కారం జనవరి నుండి మార్చి 2024 వరకు టిక్కెట్ విక్రయాల కంటే చిరుతిళ్ల అమ్మకాల ద్వారా ఎక్కువ ఆదాయం క‌నిపిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చిరుతిళ్ల అమ్మకాలు 21% పెరిగి రూ. 1,958.4 కోట్లకు చేరుకోగా, టిక్కెట్ల విక్రయాలు 19% వృద్ధి చెంది రూ. 3,279.9 కోట్లకు చేరుకున్నాయి.

ఈ ఏడాది మాత్రం అన్ని ర‌కాల థియేట‌ర్ల‌కు పంచ్ ప‌డింది. దేశ వ్యాప్తంగా జ‌రుగుతోన్న ఎన్నిక‌లు...ఐపీఎల్ సీజన్ కార‌ణంగా చాలా సినిమాలు రిలీజ్ కాలేదు. దీంతో ఈ ఏడాది ఫుండ్ అండ్ బేవ‌రేజెస్ ఆదాయ వృద్ధి బాక్సాఫీస్ ఆదాయ వృద్ధి రేటును అధిగమించింది. టికెట్ ఆదాయం కంటే శీత‌ల‌పానీయాలు..స్నాక్స్ పై వ‌చ్చిన ఆదాయం మెరుగ్గా ఉంది. ఒక టిక్కెట్ ధర దాదాపు 300 రూపాయ‌లు అయితే ఒక పాప్‌కార్న్ బకెట్‌తో పాటు పానీయం ధర రూ. 1000 ఖ‌ర్చు అవుతుంది. టికెట్ ..పాప్ కార్న్ మ‌ధ్య ఇంత‌టి వ్య‌త్యాసం ఉంది. అదే 1000 ల పాప్ కార్న్ బ‌కెట్ బ‌య‌ట 500-600 రూపాయ‌ల మ‌ధ్య‌లో ఉంటుంది.