స్నేహా రెడ్డి నికర ఆస్తుల విలువ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రతిభావంతుడైన పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.
By: Tupaki Desk | 18 Dec 2024 5:52 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రతిభావంతుడైన పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా హిట్లు అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ హీరోగా చరిత్ర సృష్టించాడు. పుష్ప 2తో ఈ ఫీట్ అందుకున్నాడు. పుష్ప 3తో దానిని మరో లెవల్ కి తీసుకుని వెళతాడు. అంత పెద్ద స్టార్‌కి సతీమణి స్నేహారెడ్డి. అల్లు అర్జున్- స్నేహ జంట అన్యోన్యత కపుల్ గోల్స్ గురించి అభిమానులు నిరంతరం ముచ్చటించుకుంటారు. ఇటీవల సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అరెస్ట్ సమయంలో స్నేహ తన భర్తకు ఎంత మద్ధతుగా నిలిచారో చూశాం. వారి అన్యోన్యత ప్రతి జంటకు స్ఫూర్తి.
సోషల్ మీడియాల్లోను అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో అల్లు అర్జున్- స్నేహ కూడా ఒకరు. అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి 2011లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అల్లు అయాన్ అనే కుమారుడు, అల్లు అర్హ అనే కుమార్తె ఉన్నారు. స్నేహారెడ్డి హైదరాబాద్‌కు చెందిన సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి సైంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్.ఐ.టి) చైర్మన్. స్నేహ.. అకడమిక్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ ప్రయాణంలో వ్యాపార నిర్వహణ, వ్యూహాత్మక పరిపాలనపై స్నేహారెడ్డి అపారమైన అనుభవం ఘడించారు.
స్నేహ ఉన్నత విద్యావంతురాలు. స్నేహ రెడ్డి తన విద్యను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT)లో పూర్తి చేసింది. యునైటెడ్ స్టేట్స్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. 2016లో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం ఆన్‌లైన్ ఫోటో స్టూడియో అయిన స్టూడియో పికాబూను ప్రారంభించింది. స్నేహా రెడ్డి ప్రారంభించిన వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గాను స్నేహ ఆర్జిస్తున్నారు. ఇన్ స్టాలో దాదాపు 90లక్షలకు పైగా అనుచరులు తనకు ఉన్నారు. సోషల్ మీడియాల్లో ప్రకటనల పోస్టింగులతోను భారీగా ఆర్జిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం.. స్నేహారెడ్డి ఆస్తుల విలువ సుమారు 42 కోట్లు ఉంటుందని సమాచారం.
స్నేహ తన కుటుంబం పిల్లల ఆలనాపాలన చూసుకోవడంతో పాటు, కొంత సమయాన్ని వ్యాపారం కోసం కేటాయించి బహుముఖ ప్రజ్ఞావంతురాలిగా నిరూపించుకుంటున్నారు. ఇన్ స్టాలో తన రోజువారీ జీవితం, కుటుంబ విహారయాత్రలు , వేడుకల నుంచి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.