Begin typing your search above and press return to search.

అర్హతో బన్నీ ట్రెక్కింగ్.. స్నేహ స్టన్నింగ్ పోజ్

అందుకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేస్తుంటుంది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 6:23 AM GMT
అర్హతో బన్నీ ట్రెక్కింగ్.. స్నేహ స్టన్నింగ్ పోజ్
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు స్పెషల్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. తన భర్త కన్నా స్టైలిష్ గా రెడీ అవుతూ సందడి చేస్తుంటుంది. అందుకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేస్తుంటుంది. అయితే స్నేహ.. డైట్ అండ్ ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది.


తరచుగా యోగా అండ్ జిమ్ చేస్తున్న వీడియోస్, పిక్స్.. తన ఫాలోవర్స్ కోసం పంచుకుంటూ ఉంటుంది. ఆ మధ్య షేర్ చేసిన ఓ వర్కౌట్ వీడియో ఫుల్ వైరల్ అయింది. ఇక అల్లు అర్జున్ తోపాటు పిల్లలు అయాన్, అర్హ క్యూట్ మూమెంట్స్ కూడా షేర్ చేస్తుంటుంది. అవి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. నెట్టింట వైరల్ కూడా అవుతుంటాయి. లక్షల కొద్దీ లైకులు, షేర్లు వస్తుంటాయి. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది స్నేహ.


అదిరిపోయే నేచురల్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఫోటోలో స్నేహ క్యాజువల్ ఔట్ ఫిట్ లో మెరిసింది. మరో పిక్ లో అయాన్.. చిన్న ఫ్లవర్ ను పట్టుకుని క్రేజీ పోజు ఇచ్చాడు. ఇంకో ఫోటోలో అల్లు అర్జున్, అర్హ ట్రెక్కింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పిక్స్ అన్నీ సూపర్ వదిన అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.


అయితే బన్నీ తన ఫ్యామిలీతో రీసెంట్ గా ట్రిప్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో స్నేహ కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇప్పుడు పోస్ట్ చేసినవి కూడా ఆ ట్రిప్ లోనివేనని తెలుస్తోంది. యూరప్ వెళ్లారని అప్పుడు టాక్ వినిపించింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు. శరవేగంగా షూట్ కంప్లీట్ చేయడానికి కోపరేట్ చేస్తున్నారు. త్వరలోనే తనకు సంబంధించిన పార్ట్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు.

ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై వేరే లెవల్ బజ్ క్రియేట్ చేశాయి. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్లుగా నిలిచి ఇప్పటికీ అలరిస్తున్నాయి. త్వరలోనే మరో రెండు సాంగ్స్ రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని నిర్మాత రవిశంకర్ ఇటీవల తెలిపారు. దాంతోపాటు మూవీ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవ్వనుందో చెప్పారు. మరి పుష్ప-2 ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.