బాపు బొమ్మ మిస్సింగ్..!
స్నేహ వ్యక్తిగత విషయాలను ప్రస్థావిస్తే.. 12 అక్టోబర్ 1981న సుహాసిని రాజారామ్ నాయుడుగా జన్మించింది.
By: Tupaki Desk | 5 July 2024 2:30 AM GMTబాపు తెరకెక్కించిన 'రాధాగోపాలం'లో శ్రీకాంత్ సరసన నటించింది స్నేహ. నాయుడు మామ మెచ్చే ఎంకిలా అందంగా కనిపించే స్నేహ.. రాధ పాత్రలో అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. తెలుగు నాట బాపు బొమ్మ అని పిలిపించుకున్న మేటి నటిగా హృదయాల్ని గెలుచుకుంది. స్నేహ సహజసిద్ధమైన అందంతో ఆకట్టుకున్నా.. బోల్డ్ గా గ్లామర్ ఒలకబోసినా, తనదైన ట్రెడిషనల్ లుక్ తో మైమరిపించినా ఈ బ్యూటీ ప్రత్యేకతే వేరు అంటూ కితాబిచ్చారు. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ `సన్నాఫ్ సత్యమూర్తి`లో ఉపేంద్రకు జోడీగా నటించింది. పలు తెలుగు చిత్రాల్లో యువహీరోల సరసనా అద్భుత నటనతో మెప్పించింది. తన నవ్వు చూశాక 'స్మైల్ క్వీన్'గా పట్టాభిషేకం చేసారు అభిమానులు.
స్నేహ వ్యక్తిగత విషయాలను ప్రస్థావిస్తే.. 12 అక్టోబర్ 1981న సుహాసిని రాజారామ్ నాయుడుగా జన్మించింది. మహారాష్ట్ర- ముంబైలోని ఒక తెలుగు కుటుంబంలో దుబాయ్‌లో పెరిగారు. తమిళ చిత్రం `అచ్చముందు`లో తొలిసారిగా నటుడు ప్రసన్నతో స్నేహ జతకట్టింది. 2009 లో ఆ సినిమా విడుదలైంది. అప్పటి నుండి వారి సంబంధంపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ప్రసన్న తన అన్ని మోడలింగ్ షోలలో కనిపించింది. సినిమా ప్రివ్యూలలో ఇద్దరూ కలిసి కనిపించారు. ఇద్దరూ దీనిని పుకారుగా కొట్టిపారేసినప్పటికీ తరువాత 9 నవంబర్ 2011న ప్రసన్న, అవును... స్నేహ .. నేను మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో త్వరలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము అని ప్రకటించారు. వారు 11 మే 2012న చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. ఒక కుమార్తె . ఒక కుమారుడు ఉన్నారు. వారు చెన్నైలో నివసిస్తున్నారు.
స్నేహ ఎంచుకున్న పాత్రల వల్ల తన కెరీర్‌లో ఒక నిర్దిష్ట సమయంలో సినిమా అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ తన ప్రతిభ అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకుని తన కోసమే రూపొందిన పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ది గోట్ చిత్రంలో నటిస్తోంది. బుల్లితెరపై స్నేహ డాన్స్ జోడి డ్యాన్స్ రీలోడెడ్ 2కి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్.. నటి సంగీతతో కలిసి న్యాయనిర్ణేతగా ఉన్నారు. షోలో అందమైన నవ్వుతో కవ్విస్తూ టీఆర్పీలో స్పీడ్ పెంచుతోంది స్నేహ.
అభిమానులకు అందించే ఆనందాన్ని ప్రదర్శిస్తుంది. ఈ రియాలిటీ షో నుంచి స్నేహ ఫోటోషూట్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. అదే నవ్వు.. ఎప్పటికీ చెరగని బాపు బొమ్మకు మాత్రమే సొంతం.