స్నేహారెడ్డికి నచ్చే ఐస్‌క్రీమ్ బ్రాండ్?
దిగో ఇప్పుడు స్నేహా ఇలా తనకు ఇష్టమైన ఐస్ క్రీమ్ లను లాగించేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేయడంతో అభిమానుల్లో వైలర్ గా మారుతున్నాయి ఈ ఫోటోలు.
By: Tupaki Desk | 22 Jun 2024 4:57 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ను పెంచిన చిత్రం 'పుష్ప: ది రైజ్' అయితే, అతడు రెట్టించిన ఉత్సాహం ఎనర్జీతో వ్యక్తిగత జీవితంలో ఆనందంగా ఉండటానికి కారణం భార్య స్నేహారెడ్డి. ఈ జంట అన్యోన్యత ఆనందమయ జీవన శైలి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతుంది. అభిమానులకు జంట గోల్స్ ని నిర్ధేశించే అరుదైన జంటగాను వీరు టాలీవుడ్ లో పాపులర్.
అల్లు అర్జున్ - స్నేహారెడ్డికి పెళ్లయి ఇప్పటికి 12 ఏళ్లు అవుతోంది. వారికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు. అయితే ఇద్దరు పిల్లలకు మామ్ అయినా కానీ స్నేహారెడ్డి ఇప్పటికీ టాప్ మోడల్ ని తలపిస్తుంది. సాటి హీరోల్లో షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్ పుత్ తో స్నేహారెడ్డి పోలికలను అభిమానులు చూస్తుంటారు.
స్నేహ వ్యక్తిగతంగా ఎంత సింపుల్ గా ఉంటారో ఇదిగో ఇక్కడ ఈ ఫోటోలు చూస్తేనే అవగతమవుతుంది.ఇదిగో ఇప్పుడు స్నేహా ఇలా తనకు ఇష్టమైన ఐస్ క్రీమ్ లను లాగించేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేయడంతో అభిమానుల్లో వైలర్ గా మారుతున్నాయి ఈ ఫోటోలు. కేవలం ఐస్ క్రీమ్ లు మాత్రమే కాదు తనకు నచ్చే స్వీట్స్ కూడా ఈ ఫోటోల్లో కనిపించాయి.
గతంలో సమంత టాక్ షో సామ్ జామ్‌లో కనిపించిన అల్లు అర్జున్ తన భార్య స్నేహ ప్రత్యేకత గురించి మాట్లాడాడు. ''స్నేహలో నాకు రెండు లక్షణాలు నచ్చాయి.. తను చాలా డిగ్నిఫైడ్. నైట్‌క్లబ్‌లో తెల్లవారుఝామున 2 గంటలకు కూడా తన గురించి అసభ్యకరమైన ఫిర్యాదు ఏదీ లేదు. తనకు చాలా గౌరవం ఉంది.. లైఫ్ లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది'' అని బన్ని చెప్పాడు.