హీరోయిన్లకు అయినా కన్ను కుట్టేలా
కానీ సెలబ్రిటీ వైవ్స్ లో మోడలింగ్ లో సత్తా చాటే ట్యాలెంట్ తనకు ఉందని మరోసారి నిరూపిస్తూ ఈ కొత్త లుక్ లో కనిపించారు.
By: Tupaki Desk | 16 April 2024 4:35 PMహీరోయిన్లకు అయినా కన్ను కుట్టే రూపం.. ఆ లుక్కు చూసారా? స్టార్ హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఒక టాప్ మోడల్ కి, అందమైన కథానాయికకు ఎంతమాత్రం తగ్గరని అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇలా డిజైనర్ లుక్ లో కనిపించడం స్నేహారెడ్డికి కొత్తేమీ కాదు. కానీ సెలబ్రిటీ వైవ్స్ లో మోడలింగ్ లో సత్తా చాటే ట్యాలెంట్ తనకు ఉందని మరోసారి నిరూపిస్తూ ఈ కొత్త లుక్ లో కనిపించారు.
గరిమగార్గ్ ఈ లుక్ కి స్టైలింగ్ చేసారు... రిమ్ జిమ్ డాడు ఔట్ ఫిట్‌కి రూపకర్త... అని స్నేహారెడ్డి సోషల్ మీడియాల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ కొత్త లుక్ అంతర్జాలంలో వైరల్‌గా మారింది. స్నేహా ఈ డిజైనర్ లుక్‌లో చాలా అందంగా ఉన్నారంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. లెదర్ తో డిజైన్ చేసిన బాటమ్.. డిజైనర్ టాప్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయంటూ ప్రశంసిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో మీరా రాజ్ పుత్ తర్వాత టాలీవుడ్‌లో అంతటి అందగత్తెగా స్నేహా వెలిగిపోతున్నారు..! అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. బన్ని సరసన కథానాయికగా నటించేస్తుందేమో! అని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. స్టార్ హీరో అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియాలో పాపులారిటీ సంపాదించుకున్నారు. పుష్ప ఘనవిజయం సాధించాక పుష్ప 2తో సంచలనాలకు తెరతీయబోతున్నాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టీజర్ విడుదల చేయగా వైరల్ గా దూసుకెళ్లింది. తదుపరి ట్రైలర్ తో మరింత దూకుడు ప్రదర్శించాలని సుక్కూ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.