ఆ నటి పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?
అయితే స్నిగ్ద రీల్ లైఫ్ లోనే రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటుంది. ఏ విషయంలో అయినా డేర్ అండ్ డ్యాషింగ్ గాళ్. స్నిగ్ధ శివ భక్తురాలు కూడా .
By: Tupaki Desk | 15 March 2024 1:30 AM GMTక్యారెక్టర్ ఆర్టిస్ట్ స్నిగ్ద గురించి పరిచయం అవసరం లేదు. `అలా మొదలైంది`.. `మేం వయసుకు వచ్చాం`.. `దమ్ము`..` కళ్యాణ వైభోగమే` ఇలా దాదాపు 25 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపును దక్కించుకుంది. ఆమె నటనకు ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు..అభిమానులు కూడా ఉన్నారు. స్నిగ్ద ఆడపిల్ల అయినా మగరాయుడి గెటప్ లో మెప్పించడం ఆమెకి మాత్రమే చెల్లింది. మగరాయుడి గెటప్ లో కామెడీ పండించడంతోనే అంత పేరొచ్చింది.
అయితే స్నిగ్ద రీల్ లైఫ్ లోనే రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటుంది. ఏ విషయంలో అయినా డేర్ అండ్ డ్యాషింగ్ గాళ్. స్నిగ్ధ శివ భక్తురాలు కూడా . ఏటా తప్పకుండా శివమాల ధరిస్తుంటుంది. మరి ఈ లేడీ పులి ఇంకా పెళ్లి చేసుకోలేదు. 43 ఏళ్లు వచ్చినా? ధాంపత్య జీవితానికి దూరంగానే ఉంది. మరి ఇలా ఎందుకు అంటే? స్నిగ్ద చాలా విషయాలే పంచుకుంది. అవేంటో ఆమె మాటల్లోనే.. నాకు పెళ్లి బంధం పై నమ్మకం లేదు. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు.
ఇప్పటివరకు నా జీవితంలో అలాంటి పరిస్థితులు కూడా ఎదురు కాలేదు. నేను దీక్షలో ఉన్నాను. 120 రోజుల పాటు ఇదే దీక్షలో ఉంటాను. అలా నాకు టైంపాస్ అయిపోతుంది. పెళ్లి చేసుకుంటే నేను మరొకరి ఆధీనంలో ఉండాల్సి వస్తుంది. అందుకే మ్యారేజ్ చేసుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని..పిల్లల్ని కని జీవితాంతం వారి చుట్టూ తిరిగే బధులు సంపాదించిన దాంతో హాయిగా ఉండటం మంచిదనిపిస్తుంది.
నేను తినగా మిగిలిన ఆస్తిపాస్తులు ఏవైనా ఉంటే? అనాధాశ్రమాలకు ఇచ్చేస్తే వారైనా బాగుపడతారు. ఇప్పటికే అలా చేయడం ప్రారంభించాను` అని తెలిపింది. మొత్తానికి దీక్ష కూడా సంచలనాల రాంగోపాల్ వర్మ తరహా వ్యక్తిత్వంలా ఉంది. వర్మ పెళ్లి చేసుకుని భార్యకు దూరమైన తర్వాత ఆయన వివాహ వ్యవస్థపై తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పిన సందర్భాలెన్నో. అలాగే వర్మ శిష్యుడైన పూరి జగన్నాధ్ కూడా అలాగే పెళ్లైన కొన్నాళ్లకి పెళ్లి ఎందుకు చేసుకున్నానని ఫీలయ్యాడు.