Begin typing your search above and press return to search.

కాబోయే భార్యతో చైతూ.. వ్వాటే స్టైల్..

అయితే తాజాగా నాగ చైతన్య.. సోషల్ మీడియాలో క్రేజీ పిక్ ను షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:27 PM GMT
కాబోయే భార్యతో చైతూ.. వ్వాటే స్టైల్..
X

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. త్వరలో ఏడడుగులు నడవనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 8వ తేదీన నాగార్జున ఇంట్లో చైతూ, శోభిత ఎంగేజ్మెంట్ సింపుల్ గా జరిగింది. నాగార్జుననే తొలుత నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంగేజ్మెంట్ పిక్స్ పోస్ట్ చేశారు. అనంతరం చైతూ, శోభిత కూడా ధృవీకరించారు. వారిద్దరి పెళ్లి తేదీని ఇప్పటికీ ఇంకా ప్రకటించలేదు.


అయితే తాజాగా నాగ చైతన్య.. సోషల్ మీడియాలో క్రేజీ పిక్ ను షేర్ చేశారు. శోభితతో కలిసి లిఫ్ట్ లో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ఎవ్రీథింగ్ ఎవరీ వేర్ ఆల్ ఎట్ ఒన్స్ అంటూ శోభిత తీసిన సెల్ఫీకి క్యాప్షన్ ఇచ్చారు. చైతూ, శోభిత ఇద్దరూ బ్లాక్ గ్లాసెస్ తో వేరే లెవెల్ లో ఉన్నారు. జీన్స్ ఔట్ ఫైట్స్ లో కిర్రాక్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. చైతూ.. తన పోస్ట్ కు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయడం గమనార్హం.

ఇక.. నాగ చైతన్య కొన్నేళ్ల క్రితం స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు. కానీ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. పెళ్లి అయిన నాలుగేళ్లకే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య ప్రేమ, పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తెనాలి బ్యూటీ శోభితతో నాగ చైతన్య .. డేటింగ్ లో ఉన్నారని చాలా నెలల పాటు వార్తలు వచ్చాయి. వాటికి బలం చేకూర్చేలా తరచూ వాళ్లిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలు ఎప్పటికప్పుడు బయటకు వచ్చాయి. లండన్ లోని ఓ రెస్టారెంట్ లో చెఫ్ తో చైతూ దిగిన పిక్.. బయటకు వచ్చింది. అందులో శోభిత కనిపించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ట్రిప్ కు వెళ్లినట్లు.. ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా క్లారిటీ వచ్చింది.

అయితే చాలా మంది వారిద్దరూ ఫ్రెండ్స్ అనే అనుకున్నారు. కానీ కొందరు మాత్రం ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత సడెన్ గా నాగార్జున.. వారి ఎంగేజ్మెంట్ విషయాన్ని అనౌన్స్ చేశారు. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా చేసేందుకు ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మూడు ముళ్ల బంధంతో చైతూ, శోభిత ఎప్పుడు ఒకటి అవుతారో చూడాలి.