చైతన్య లాంటి వ్యక్తి భర్తగా దక్కడం అదృష్టం
By: Tupaki Desk | 8 Dec 2024 4:32 PM GMTమంచి మనసు దయ ఇతరుల పట్ల మర్యాదగా హుందాగా ప్రవర్తించే లక్షణాలు చైతన్యలో తనకు నచ్చాయని అన్నారు శోభిత ధూలిపాల. అతడి సింప్లిసిటీ తనకు నచ్చుతుందని వ్యాఖ్యానించారు. తమ వివాహ వేడుక నుండి మొదటి ఫోటోలను షేర్ చేసిన శోభిత పైవిధంగా వ్యాఖ్యానించారు. చైతన్య లాంటి భర్త తనకు దక్కడం అదృష్టమని శోభిత అన్నారు. తనను అతడు ఎంతో బాగా చూసుకుంటాడని, ప్రేమగా ఉంటాడని కూడా శోభిత పేర్కొన్నారు.
ఈ మొదటి పెళ్లి ఫోటోలలో శోభిత- నాగ చైతన్య జంట ట్రెడిషనల్ వధూవరుల గెటప్ అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరూ వివాహ ఆచారాలను నిర్వహించే ఫోటోలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఒక ఫోటోలో, చైతన్య ఆమె మెడలో దండ వేయడానికి ప్రయత్నించినప్పుడు శోభిత వెనుకకు వంగి కనిపించింది. శోభిత -చైతన్య ఒకరినొకరు చూసుకుని మురిసిపోయారు. వివాహ వేడుకలో శోభిత నేలపై కూర్చున్నప్పుడు అతడిని తదేకంగా చూస్తూ కనిపించింది. ఆ ఇద్దరి మధ్యా ప్రేమానుబంధం ప్రతి ఫోటోలో అనువణువునా కనిపించాయి.
బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావన్నారు:
తన కెరీర్ ఆరంభంలో అవకాశాల పరంగా ఎన్నో తిరస్కరణలకు గురయ్యానని కూడా శోభిత వెల్లడించారు. నువ్వు అందంగా లేవని, ఆకర్షణ లేదని ముఖంపైనే చెప్పేవారని కూడా శోభిత ధూళిపాల తెలిపారు. ఓ ప్రముఖ కంపెనీ వాణిజ్య ప్రకటన కోసం వెళితే నువ్వు కనీసం బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికి రావని అవమానించినట్టు తెలిపింది. పట్టుదల కృషితో ప్రయత్నించి అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యానని కూడా శోభిత ధూళిపాల అన్నారు. ఇకపైనా నటించాలంటే తనకు పాత్ర నచ్చాలని, నిరంతరం నటించాలనే కోరిక తనకు లేదని కూడా వెల్లడించారు. మరోవైపు నాగచైతన్య కూడా తన పెళ్లి అనంతరం ప్రణాళికలపై ముచ్చటించారు. తనకు ఇద్దరు పిల్లలు చాలని, వారితో తన చిన్ననాటి ఆనంద క్షణాలను తిరిగి ఆస్వాధించాలని కోరకుంటున్నట్టు తెలిపాడు.