Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : చైతూ శోభిత పెళ్లి పనులు షురూ

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాగ చైతన్యకి ఇటీవలే హీరోయిన్ శోభితా ధూళిపాళతో వివాహ నిశ్చితార్థం అయింది.

By:  Tupaki Desk   |   21 Oct 2024 9:20 AM GMT
క్లిక్‌ క్లిక్‌ : చైతూ శోభిత పెళ్లి పనులు షురూ
X

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాగ చైతన్యకి ఇటీవలే హీరోయిన్ శోభితా ధూళిపాళతో వివాహ నిశ్చితార్థం అయింది. అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది ఎప్పుడు వీరి పెళ్లి జరగబోతుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లి తేది విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కి తెర దించుతూ పెళ్లి ఏర్పాట్లు మొదలు అయ్యాయి. శోబితా ధూళిపాళ ఇంట పెళ్లి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. వైభవంగా శోభితా ఇంట వేడుక జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నాగ చైతన్య, శోభిత సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి పెద్దల అంగీకారం లభించడంతో ఆగస్టులో వివాహ నిశ్చితార్థం జరిగింది. వివాహం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే ఇండస్ట్రీ వర్గాల వారు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిశ్చితార్థం చాలా సింపుల్‌గా జరిగినా వివాహం మాత్రం వైభవంగా జరగబోతుందని సమాచారం అందుతోంది. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని శోభిత ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ స్టిల్స్ చూస్తే అర్థం అవుతోంది.

తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో శోభిత సాంప్రదాయబద్దమైన చీర కట్టులో కనిపించి నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. రెండు రోజుల ముందు చైతూతో కలిసి మోడ్రన్‌ డ్రెస్‌లో కనిపించి విమర్శలు ఎదుర్కొన్న శోభిత తక్కువ సమయంలోనే ఇలా చీర కట్టులో కనిపించి మెప్పించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శోభిత పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అతి త్వరలోనే వీరి వివాహ వేడుక జరుగబోతుందని క్లారిటీ వచ్చింది. ఇద్దరు కలిసి ఈ మధ్య కాలంలో షాపింగ్స్ తో పాటు, పార్టీలకు హాజరు అవుతూ లైఫ్‌ ని ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలు, వీడియోలు షేర్‌ అవుతూనే ఉన్నాయి.

నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే తండేల్ సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమాను రూపొందిస్తున్నారు. నాగ చైతన్య పెళ్లి తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతే కాకుండా శోభిత తో కలిసి నాగ చైతన్య నటించాలని చాలా మంది ఆశ పడుతున్నారు. గతంతో సమంతను వివాహం చేసుకున్న తర్వాత ఆమెతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించిన నాగ చైతన్య తప్పకుండా శోభిత తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంతా అంటున్నారు.