కాలేజ్ రోజుల్లో తనకు ఎన్నో లవ్ ప్రపోజల్స్
మొత్తానికి గతేడాది డిసెంబర్ లో ఈ ప్రేమికులు ఇరు కుటుంబాలను ఒప్పించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఒకటైన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 13 March 2025 3:19 PM ISTటాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారని వార్తలొచ్చాయి. కానీ అప్పుడు మాత్రం తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్తూ తమ ప్రేమను రహస్యంగానే ఉంచారు. మొత్తానికి గతేడాది డిసెంబర్ లో ఈ ప్రేమికులు ఇరు కుటుంబాలను ఒప్పించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఒకటైన విషయం తెలిసిందే.
నాగ చైతన్య శోభిత కంటే ముందు సినీ తార సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వ్యక్తిగత మనస్పర్థల వల్ల పరస్పర అంగీకారంతో చై, సమంతలు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత నుంచి చైతన్య, శోభితతో ప్రేమలో ఉన్నాడు. అయితే శోభిత, చైతన్య కంటే ముందు ఓ వ్యక్తిని ప్రేమించిందట.
ఈ విషయాన్ని స్వయంగా శోభితానే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన స్కూల్ డేస్ లో శోభిత ఓ అబ్బాయిని ఇష్టపడిందట. కానీ ఆ అబ్బాయి మాత్రం అసలు శోభిత వైపే చూసేవాడు కాదట. అతని బిహేవియర్ చూసి తనకు చాలా బాధేసేదని చెప్పిన శోభిత, అతని చూపు తన వైపు తిప్పుకునేందుకు స్కూల్ లో వ్యాస రచన లాంటి పోటీలపై ఫోకస్ చేశానని తెలిపింది.
ఆ పోటీల్లో టాపర్ గా నిలిస్తే అయినా ఆ అబ్బాయి తన వైపు చూస్తాడనుకుని ఆశతో శోభిత వాటిపై ఫోకస్ పెట్టిందట. అలా వాటిపై ఫోకస్ చేసే టైమ్ లో అతని గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశానని, క్రమంగా తన మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయని శోభిత తెలిపింది.
కాలేజ్ రోజుల్లో తనకు ఎన్నో లవ్ ప్రపోజల్స్ వచ్చాయని చెప్పిన శోభిత, తాను కూడా కొన్ని లెటర్స్ రాశానని చెప్పింది. అయితే అబ్బాయిల విషయంలో తన అభిరుచి అసలు బావుండేది కాదని చెప్పిన శోభిత మొత్తానికి అక్కినేని రాకుమారుడైన నాగ చైతన్యను పెళ్లాడి తన టేస్ట్ బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంది. గతంలో మేజర్, గూఢచారి, కల్కి సినిమాల్లో మెప్పించిన శోభితా బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం శోభిత గూఢచారి2లో నటిస్తోంది.