Begin typing your search above and press return to search.

అక్కినేని కోడ‌లు మూవీకి BAFTA నామినేషన్‌

అక్కినేని కోడ‌లు శోభిత ధూళిపాళ నటించిన `మంకీమ్యాన్` ప్రతిష్టాత్మక BAFTA కు నామినేట్ అయింది.

By:  Tupaki Desk   |   18 Jan 2025 2:07 PM GMT
అక్కినేని కోడ‌లు మూవీకి BAFTA నామినేషన్‌
X

అక్కినేని కోడ‌లు శోభిత ధూళిపాళ నటించిన `మంకీమ్యాన్` ప్రతిష్టాత్మక BAFTA కు నామినేట్ అయింది. ప్రతిభావంతురాలైన‌ శోభితా కెరీర్‌లో ఇది మరో మైలురాయి. ఆస్కార్ విన్నింగ్ `స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్` న‌టుడు దేవ్ పటేల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ స్వీయ‌ దర్శకత్వంలో తెర‌కెక్కించిన హాలీవుడ్ చిత్రం `మంకీ మ్యాన్` అంత‌ర్జాతీయంగా విడుద‌లై అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ చిత్రంలో న‌టించిన శోభిత‌కు మంచి పేరొచ్చింది.


`ఈ చిత్రం బ్రిటిష్ రచయిత, ద‌ర్శ‌క‌నిర్మాత అత్యుత్తమ అరంగేట్రం` విభాగంలో బాఫ్టాకు నామినేట్ అయింది. ఈ చిత్రంతోనే న‌టుడు దేవ్ ప‌టేల్ ద‌ర్శ‌కుడిగాను ఆరంగేట్రం చేసాడు. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ సినిమాలు బాఫ్టా కోసం పోటీప‌డుతుండ‌గా, భార‌తీయ యువ‌కుడు తెర‌కెక్కించిన సినిమా వాటితో పోటీప‌డ‌టం నిజంగా గొప్ప అఛీవ్ మెంట్. ఇది ప్రపంచ సినిమాపై `మంకీ మ్యాన్` ప్రభావాన్ని ఆవిష్క‌రిస్తోంది. అవినీతి ప్ర‌పంచం నుంచి విముక్తిని కోరుకునే మాజీ దోషి జీవిత ప్ర‌యాణంపై తెర‌కెక్కిన‌ సినిమా ఇది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంలో దేవ్, శోభిత త‌దిత‌రులు న‌ట‌న ప్ర‌శంస‌లు అందుకుంది.

ఈ చిత్రం బాఫ్టాకు నామినేట్ అవ్వ‌డం అరుదైన గౌర‌వం పెంచే క్ష‌ణం. శోభిత గ‌తంలో మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 , ది నైట్ మేనేజర్ లలో పాత్రలకు విస్తృతంగా ప్రశంసలు అందుకుంది. ఇటీవ‌లే నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడి అక్కినేని ఇంట కోడ‌లిగా అడుగుపెట్టింది. ఇంత‌లోనే త‌న సినిమాకి `బాఫ్టా నామినేష‌న్` పేరుతో శుభ‌వార్త అందింది. ది మంకీ మ్యాన్ అంత‌ర్జాతీయంగా విడుద‌లైనా ఇంకా ఇండియాలో విడుద‌ల కావాల్సి ఉంది.