Begin typing your search above and press return to search.

అక్కినేని కొత్త కోడలు మంచి ఫుడీలా ఉందే!

టాలీవుడ్ ప్రముఖ కుటుంబాల్లో ఒక్కటైన అక్కినేని ఇంట.. కోడలి గా హీరోయిన్ శోభిత ధూళిపాళ అడుగు పెట్టనున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Aug 2024 4:09 AM GMT
అక్కినేని కొత్త కోడలు మంచి ఫుడీలా ఉందే!
X

టాలీవుడ్ ప్రముఖ కుటుంబాల్లో ఒక్కటైన అక్కినేని ఇంట.. కోడలి గా హీరోయిన్ శోభిత ధూళిపాళ అడుగు పెట్టనున్న విషయం తెలిసిందే. ఇటీవల అక్కినేని నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ నాగార్జున ఇంట్లో సింపుల్ గా జరిగింది. నిశ్చితార్థం తర్వాత నాగార్జున తొలుత తన ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకున్నారు. కొత్త జంట ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.

అనంతరం చై, శోభిత కూడా తమ సోషల్ మీడియా వాల్స్ లో పిక్స్ ను పోస్ట్ చేశారు. ఆ ఫోటోస్ కొన్ని డేస్ పాటు వైరల్ గా మారాయి. అయితే చైతన్య పెళ్లి.. ఫారిన్ లో జరగనుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ చై మాత్రం.. పెళ్లికి సంబంధించి ఇంకా ప్లాన్స్ అనుకోలేదని క్లారిటీ ఇచ్చారు. వివాహం ఎక్కడ? ఎప్పుడు? అన్న విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

అయితే శోభితకు చెందిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కినేని కొత్త కోడలు బాగా లాగిస్తున్న పిక్స్ కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. ఫుల్ లంచ్ మీల్స్, నూడిల్స్ తింటున్న పిక్స్ తో పాటు శోభిత చాయ్ చేస్తున్న ఫోటోస్ కూడా ఉన్నాయి. నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. అక్కినేని కొత్త కోడలు మంచి ఫుడీలా ఉందే! అని అంటున్నారు. లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు.

ఇక.. గతంలో నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంతను గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఏ మాయ చేసావే మూవీలో ఇద్దరూ కలిసి నటించగా.. ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వారు.. 2017లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత మజిలీ మూవీలో కూడా యాక్ట్ చేశారు. కొన్నాళ్ళ పాటు అన్యోన్యంగా ఉన్న వారు.. 2022లో విడిపోయారు.

అక్కడికి కొద్ది రోజుల తర్వాత.. నాగ చైతన్య, శోభిత డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి లండన్ లోని ఓ రెస్టారెంట్ లో ఉన్న ఫోటో వైరల్ అయింది. అప్పుడు చై, శోభిత డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. రీసెంట్ గా ఓ టూరిస్ట్ స్పాట్ కు ఇద్దరూ కలిసి వెళ్లినట్లు వారి వారి స్టేటస్ లు చెప్పేశాయి. దీంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. నేరుగా నాగార్జుననే ఎంగేజ్మెంట్ అయ్యాక అనౌన్స్ చేశారు. అలా త్వరలో నాగ చైతన్య, శోభిత ఒక్కటవ్వనున్నారు.