Begin typing your search above and press return to search.

శోభిత దూళిపాళ్ల కొత్త సినిమా.. ఎలా ఉందంటే..

గ్లామరస్ హీరోయిన్ గా సక్సెస్ అయిన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల త్వరలో అక్కినేని ఇంటి కోడలిగా మారబోతోంది.

By:  Tupaki Desk   |   29 Sep 2024 1:30 PM GMT
శోభిత దూళిపాళ్ల కొత్త సినిమా.. ఎలా ఉందంటే..
X

గ్లామరస్ హీరోయిన్ గా సక్సెస్ అయిన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల త్వరలో అక్కినేని ఇంటి కోడలిగా మారబోతోంది. అక్కినేని నాగ చైతన్యతో, శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ కొన్ని నెలల క్రితం జరిగింది. ఇక వీరి పెళ్లి ఎప్పుడనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అక్కినేని ఇంటి కోడలిగా మారబోతోంది తెలిసాక తెలుగు ప్రేక్షకులు ఎక్కువ మంది శోభిత గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు.

శోభిత దూళిపాళ్ల తెలుగులో ‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాలలో మాత్రమే నటించింది. అయితే హిందీలో ఆమె సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువ చేసింది. రీసెంట్ గా శోభిత దూళిపాళ్ల చేసిన ‘లవ్ సితార’ మూవీ జీ5లో రిలీజ్ అయ్యింది. రోనీ స్క్రూవాలా నిర్మాణంలో వందన కటారియా దర్శకత్వంలో తెరకెక్కింది. రాజీవ్ సిద్ధార్ధ్ ఈ చిత్రంలో శోభిత దూళిపాళ్లకి జోడీగా నటించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కథాంశం మోడ్రన్ లవ్ అండ్ రిలేషన్ షిప్ నేపథ్యంలో ఉంటుంది.

హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోన్న యంగ్ సక్సెస్ ఫుల్ విమెన్ సితార తన ప్రియుడితో కలిసి రిలేషన్ లో ఉంటుంది. అంతా బాగుందనుకునే సమయంలో సడెన్ గా ఆమె గర్భవతి అనే విషయం తెలుస్తుంది. దీంతో తన అమ్మమ్మ ఇంట్లో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఫ్యామిలీతో అందరూ కలిసి కేరళలో సితార అమ్మమ్మ ఇంటికి వెళ్తారు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో మరల ఆమె నిర్ణయాలని ఆమె ప్రశ్నించుకుంటుంది. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది లవ్ సితార కథాంశంగా ఉంటుంది.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదనే మాట వినిపిస్తోంది. మూవీలో శోభిత దూళిపాళ్ల మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నా ఓవరాల్ గా స్టోరీ నేరేషన్ పెద్దగా మెప్పించలేదంట. ముఖ్యంగా కంటెంట్ చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుందనే మాట క్రిటిక్స్ నుంచి వినిపిస్తోంది. దాంతో పాటు విజువల్ కలర్ కూడా కంటెంట్ పై ప్రేక్షకులని డైవర్ట్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా డిజిటల్ ఆడియన్స్ ని నిరాశపరిచిందని అంటున్నారు. సంగీత్ అండ్ సిద్దార్ధ్ అందించిన మ్యూజిక్ సినిమాకి కొంత ఎనర్జీ అందించినా, మూవీ సబ్ ప్లాట్స్ కథని పూర్తిగా డీవియేట్ చేశాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.