Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్‌ 8 : హౌస్‌లోకి చైతూ, శోభిత

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 8 ఇటీవలే ప్రారంభం అయింది. వరుసగా ఆరో సీజన్ కీ నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 4:57 AM GMT
బిగ్‌బాస్‌ 8 : హౌస్‌లోకి చైతూ, శోభిత
X

తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 8 ఇటీవలే ప్రారంభం అయింది. వరుసగా ఆరో సీజన్ కీ నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడు. ఆదివారం ఎపిసోడ్‌ తో ప్రారంభం అయిన బిగ్‌బాస్ సీజన్ 8 కి ప్రేక్షకుల నుంచి నెగటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఒక్కరు ఇద్దరు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ పెద్దగా తెలియదు. ఆ ఒక్కరు ఇద్దరు కూడా పెద్ద ఫేమస్ ఏమీ కాదు. ఇలాంటి కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ ను ఎలా నెట్టుకు వస్తారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎవర్రా మీరంతా అంటూ నెట్టింట బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ గురించి ట్రోల్స్‌ ఇంకా మీమ్స్ వస్తున్నాయి.

నిర్వాహకులు మాత్రం ఈ కంటెస్టెంట్స్ తోనే షో ను సక్సెస్‌ దిశగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్‌ బాస్ లో గొడవలు ఉంటేనే ఆట రక్తి కడుతుంది. అందుకే మొదటి రోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య రచ్చ పెట్టే ప్రయత్నాలు జరిగాయి. హౌస్ లోకి పలువురు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు, అదే విధంగా ప్రత్యేక అతిథులు కూడా ఈ సారి హౌస్‌ లో అడుగు పెట్టి ఆసక్తి పెంచే విధంగా నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బిగ్‌ బాస్ హౌస్‌ లోకి త్వరలోనే నాగ చైతన్య, శోభితలు అతిథులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

సమంత నుంచి విడి పోయిన నాగ చైతన్యకి ఇటీవల హీరోయిన్‌ శోభితతో వివాహ నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగబోతుంది. పెళ్లికి ముందే వీరు బిగ్ బాస్ హౌస్‌ లో అడుగు పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఏదైనా సినిమా ప్రమోషన్‌ లేదా ప్రోడక్ట్‌ ప్రమోషన్‌ కి మాత్రమే సెలబ్రిటీలు హౌస్ లో అడుగు పెడతారు. మరి నాగ చైతన్య, శోభిత ఏ కారణంతో హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు బిగ్‌ బాస్ నిర్వాహకుల నుంచి చైతూ, శోభిత ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతోంది.

నెట్టింట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు మాత్రం ప్రస్తుతం చైతూ సినిమా రిలీజ్ కు లేదు, శోభిత కూడా నటిస్తున్న సినిమాలు ఏవీ విడుదల కాబోవడం లేదు. కనుక చైతూ, శోభిత లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అనే వార్తలు పూర్తిగా అవాస్తవం అయి ఉంటాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య తండేల్ సినిమాను చేస్తున్నాయి. సాయి పల్లవి హీరోయిన్‌ గా నటిస్తున్న ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.