కాబోయే వధువు శోభిత అందుకేనా ఈ సైలెన్స్!
ఆగస్ట్‌లో చై-శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత శోభిత ఇప్పటికీ సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Sep 2024 11:30 AM GMTఆగస్ట్‌లో చై-శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత శోభిత ఇప్పటికీ సైలెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి ప్రణాళికల గురించి తను స్వయంగా ఏదైనా చెబుతుందని ఎదురు చూస్తే, ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే తన నిశ్చితార్థం, వివాహ ప్రణాళికల గురించి మొదటిసారిగా ఓపెన్ గా మాట్లాడింది. శోభిత తాను ఎప్పుడూ వివాహం అనే సంస్థ లేదా వ్యవస్థను ఎలా విశ్వసిస్తుందో.. తన పెళ్లి గురించి ఎలా ఊహించుకుంటుందో కూడా మాట్లాడింది.
తన సినిమా `లవ్ సితార` ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..తనకు ఇలాంటి విషయాలలో అనవసర అంచనాలు ఉండవని ఖరాకండిగా తెలిపింది. ``నేను చాలా అంచనాలు లేదా కలలతో ఈ క్షణంలోకి వెళ్లానని అనుకోను. నేను ఈ దశలో అక్కడ ఉన్నానని అనుకుంటున్నాను.. ఇదంతా చాలా రిలాక్స్ డ్గా, సింపుల్‌గా, స్వీట్‌గా, సన్నిహితంగా.. వామ్గా ఉంది. నేను అనుకున్నదే అవుతోంది`` అని అంది. పెళ్లి లేదా నిశ్చితార్థం వంటి వేడుకలు వారసత్వం, మూలాలకు సంబంధించిన అంశాలతో ఎగ్జయిట్ చేస్తాయని శోభిత అంది. పెళ్లి చేసుకోవాలని.. పిల్లల్ని కనాలని తాను ఎల్లపుడూ కోరుకున్నానని తెలిపింది.
అంతేకాకుండా ఎదిగే వయసులో ఆదర్శ వివాహాలపై తన అవగాహన గురించి శోభిత మాట్లాడింది. నేను ఎప్పుడూ ఇలాంటి (పెళ్లి) వేడుకలో `తెలుగుదనం` ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను నా మూలాలకు చాలా దగ్గరగా ఉన్నాను. కాబట్టి పెళ్లిలో సంప్రదాయ అంశం నేను కనీసంగా ఊహించినది! అని అంది.
నాగ చైతన్య అక్కినేని-శోభిత ధూళిపాల ఆగస్టు 8న వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. చైతూ తండ్రి, హీరో నాగార్జున సోషల్ మీడియాల్లో ఈ వార్తను ఆనందంగా ప్రకటించారు. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత చైతన్య కొంతకాలంగా శోభితతో డేటింగ్ లో ఉన్నారు. నిశ్చితార్థంతో వారి బంధం అధికారికం అయింది. పెళ్లి తేదీని ప్రకటించాల్సి ఉంది. ఇంతలోనే చైతన్య తన తదుపరి చిత్రం తండేల్ రిలీజ్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నాడు. ఇందులో చైతూ మత్స్యకారుడిగా నటిస్తున్నారు. శోభిత తన తదుపరి ప్రాజెక్టులపై వర్క్ చేస్తోంది.