చైతూ ఫోటో.. శోభిత హార్ట్ మెల్ట్!
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 Feb 2025 3:16 PM GMTయంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీన చైతన్య, శోభితల వివాహం గ్రాండ్ గా జరిగింది. కొంత కాలంపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. ఇరు కుటుంబాల అంగీకారంతో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేద మంత్రాల మధ్య ఒక్కటయ్యారు.
ఆ తర్వాత నుంచి వివిధ సందర్బాల్లో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. శోభిత.. చైతూపై లవ్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తుంటారు. రీసెంట్ గా కొన్ని నెలల తర్వాత చైతూ క్లీన్ షేవ్ ఫేస్ ను చూడనున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించిన తండేల్ కోసం కొన్ని నెలలుగా నాగచైతన్య గడ్డం పెంచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తన భర్త క్యూట్ పిక్ ను పోస్ట్ చేసింది శోభిత. ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఆమె.. హార్ట్ సింబల్ యాడ్ చేయడంతో ఫుల్ వైరల్ గా మారింది. డీజే ప్లేస్ లో ఉన్న చైతూ ఫోటో షేర్ చేసి.. హార్ట్ @chay అంటూ క్యూట్ గా పోస్ట్ పెట్టింది. క్రీమ్ కలర్ స్వెట్ షర్ట్ వేసుకుని చైతూ.. ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో శోభిత పోస్ట్ వైరల్ గా మారగా.. నెటిజన్లు స్పందిస్తున్నారు. వావ్, సూపర్ పిక్ అని కామెంట్లు పెడుతున్నారు. హార్ట్ ఎమోజీస్ తో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. శోభిత పోస్ట్ స్క్రీన్ షాట్ ను వైరల్ చేస్తున్నారు. తమ సోషల్ మీడియా వాల్స్ లో పోస్ట్ చేస్తూ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్.
మరోవైపు, ఇటీవల శోభిత, చైతూ మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న చిన్నారులను కలిసి వారితో గడిపారు. కొంతసేపు మాట్లాడారు. హైదరాబాద్ లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ కు వెళ్లి.. పలువురు చిన్నారులతో సరదాగా గడిపారు. వారికి ధైర్యం కూడా చెప్పారు శోభిత, చైతూ.
అంతేకాదు ఆ కేర్ సెంటర్ సిబ్బందితో కూడా మాట్లాడారు. పిల్లల ఆరోగ్యం గురించి వివరాలను క్లియర్ గా అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సహాయం కూడా చేసినట్లు తెలుస్తోంది. అనంతరం పిల్లలు, కేర్ సిబ్బందితో ఫొటోలు దిగారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇటీవల నెట్టింట వైరల్ గా మారాయి. కొత్త జంట మంచి మనసును అంతా కొనియాడారు.