శోభిత రిలేషన్ షిప్ లో కండీషన్లే లేవా?
ఇప్పటికే డిసెంబర్ లో వివాహమంటూ ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 2 Oct 2024 2:44 PM GMTశోభితా ధూళిపాళ త్వరలో అక్కినేని ఫ్యామిలీ ఇంట కోడలిగా అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. పెళ్లికి మంచి ముహూర్తం తేదిని చూస్తున్నారు. ఆ గడియలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే డిసెంబర్ లో వివాహమంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చే ఏడాది జరుగుతుందనే ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా శోభిత రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన రిలేషన్ షిప్ లో ఎలాంటి షరత్తులు లేవు అంది. ఒక మనిషిని మూడు పద్దాల్లో వర్ణించలేని అభిప్రాయపడింది. షరత్తులు సైతం బ్రేక్ చేసిన వారిని ఇష్టపడతానని తెలిపింది. ఇంతవరకూ జీవితంలో ఎలాంటి డీల్ బ్రేకర్స్ లేరు అని అంది. ఈ వ్యాఖ్యలతో శోభిత ఎంతో ఓపెన్ గా ఉంటుందని నెటి జనులు అభిప్రాయపడుతున్నారు.
నాగచైతన్యను బాగా అర్దం చేసుకున్నాకే అతడితో ప్రేమలో పడిందని గెస్ చేస్తున్నారు. చైతన్య-శోభిత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. తొలుత ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. అటుపై అది కాస్త ప్రేమ గా దారి తీసింది. అక్కడ నుంచి పెళ్లికి ప్రమోట్ అయింది. అలాగని వీళ్లిద్దరు దీర్గ కాలంగా ప్రేమించుకోవడం లేదు. చాలా తక్కువ సమయంలోనే స్నేహితులై ప్రేమికులుగా మారారు.
నాగచైతన్య...సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభితకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం శోభిత సినిమాలు చేయలేదు. మరి కొత్త ప్రాజెక్ట్ లు నచ్చక సైన్ చేయలేదా? లేక వివాహం అనే పనిలో పడి సినిమాలకు దూరంగా ఉందా? అన్నది తెలియాలి. ఇటీవలే ఆమె నటించిన ఓ మంకీ మ్యాన్, లవ్ సితార రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.