Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : తహిలియాని అందాల గౌనులో శోభిత

వీరి వివాహ హడావిడి గత వారం పది రోజులుగా కనిపిస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   10 Dec 2024 6:15 AM GMT
పిక్‌టాక్‌ : తహిలియాని అందాల గౌనులో శోభిత
X

గత కొంత కాలంగా ప్రేమ పక్షుల్లా తిరుగుతూ వచ్చిన నాగ చైతన్య, శోభిత దూళిపాళ వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ప్రత్యేకంగా వేసిన పెళ్లి మండపం సెట్‌లో శోభిత మెడలో నాగ చైతన్య మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడు అడుగులు నడిచి భార్యను చేసుకున్నాడు. నాగ చైతన్య, శోభితల వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీరి వివాహ హడావిడి గత వారం పది రోజులుగా కనిపిస్తూనే ఉంది. పెళ్లి అయిన తర్వాత పోస్ట్‌ వెడ్డింగ్‌ పార్టీ నిర్వహిస్తున్నారు.


తాజాగా శోభిత తన పోస్ట్‌ వెడ్డింగ్‌ పార్టీని నిర్వహించడం జరిగింది. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు ముంబైకి చెందిన ప్రముఖ నటీనటులు, ఫ్యాషన్ డిజైనర్స్ సైతం ఈ పార్టీకి హాజరు అయ్యారని తెలుస్తోంది. స్నేహితులు, సన్నిహితులతో చాలా సంతోషంగా సాగిన ఈ పార్టీలో శోభిత తహిలియాని డిజైన్‌ చేసిన అందాల యూనిక్‌ ఔట్‌ ఫిట్‌లో కనిపించింది. వరుసగా పెళ్లి చీర కట్టు, ఆ తర్వాత పెళ్లి సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా అందంగా కనిపించి ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేసింది.


అశ్లీలత లేకుండా చాలా అందంగా బంగారు వర్ణపు యూనిక్ గౌనులో శోభిత చాలా అందంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తూ ఉన్నారు. తరుణ్ తహిలియాని ప్రముఖ బాలీవుడ్‌ డిజైనర్‌ అనే విషయం తెల్సిందే. ఆయన ఎంతో మంది బాలీవుడ్‌ ప్రముఖ స్టార్స్‌కి డిజైనర్‌గా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి తహిలియాని డిజైన్‌ చేసిన ఈ అందమైన డ్రెస్‌లో శోభిత మరింత అందంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలను తహిలియాని టీం ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా షేర్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి.


నటి శోభిత బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతే కాకుండా వెబ్‌ సిరీస్‌తో తనలోని నటిని చూపించింది. తమిళ్‌, తెలుగులోనూ శోభిత నటిస్తూ వచ్చింది. ముందు ముందు తెలుగు సినిమాల్లో నటించే విషయమై క్లారిటీ లేదు, కానీ కచ్చితంగా హిందీ, తమిళ్‌ సినిమాలు, సిరీస్‌లో నటించేందుకు ఆమె ఆసక్తిగా ఉంది. ఇటీవల ఆమె నటించిన సిరీస్ విడుదల అయ్యింది. మరో వైపు నాగ చైతన్య తండేల్‌ సినిమాతో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.