శోభిత డ్రీమ్ రాష్ట్ర పతి దగ్గర పనిచేయడమా?
కానీ దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి దగ్గర పనిచేయాలనుకున్న వాళ్లు హీరోయిన్ అవుతారనుకున్నారా? అంటే అందుకు ఉదహారణ తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ.
By: Tupaki Desk | 8 Oct 2024 10:30 AM GMTకొందరు విషయంలో లక్ష్యాలు మధ్యలో మారిపోతుంటాయి. డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్లు యాక్టరవుతారు. యాక్టర వ్వాలనుకున్న వాళ్లు డాక్టర్లు అవుతుంటారు. ఇది సహజంగా హీరోయిన్ల నోట ఎక్కువగా వినిపించే మాట. కానీ దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి దగ్గర పనిచేయాలనుకున్న వాళ్లు హీరోయిన్ అవుతారనుకున్నారా? అంటే అందుకు ఉదహారణ తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ. బాగా చదువుకునే తెలివైన అమ్మాయి నటిగా ఎలా మారిందో? ఆమె మాటల్లోనే.. లక్ష్యం లేకుండానే సినిమా రంగంలోకి వచ్చాను.
మోడల్ గా ఆడిషన్స్ కి వెళ్లినప్పుడు చాలా సంఘటనలు ఎదురయ్యాయి. అవి నన్నెంతో బాధించాయి. కానీ అవే తెలియకుండా నాలో పట్టుదల పెంచాయి. అవన్నీ గుర్తు చేసుకుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాన్న నేవీ ఆఫీసర్ కావడం..అమ్మ టీచర్ కావడంతో ఇంట్లో కేబుల్ కనెక్షన్ కి బధులు లైబ్రెరీ ఉండేది. దీంతో చదవడం హాబీగా మారిపోయింది. ఊహ తెలిసాక చదివిన తొలి పుస్తకం `బుగుగు`. ఇంటర్ లో ఉన్నప్పుడు ఆర్దిక విషయాలకు సంబంధించిన వార్తలు చదివేదాన్ని.
రాష్ఠ్ర పతి దగ్గర ఛీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా పనిచేయాలని కలలు కనేదాన్ని. క్లాస్ లో అమ్మాయిలంతా రణబీర్ కపూర్ క్రష్ అంటే? ఆ హీరో అంటే ఇష్టం అంటుంటే? నేను మాత్రం ఆర్బీఐ గవర్నర్ రాజన్, చిదంబరం, శశిథరూర్ గురించి మాట్లాడేదాన్ని. దీంతో అంతా నన్ను చాలా వింతగా చూసేవారు. వైజాగ్ లో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ముంబై వచ్చి డిగ్రీ చేరా. అప్పుడే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాక మోడలింగ్ చేయాలనుకున్నా. అలా ప్రయాణం మొదలు పెట్టాను.
శోభిత త్వరలో అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తో ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా ఈ వేడుక జరిగింది. వివాహం కూడా నిరాడంబరంగానే జరిగే అవకాశం ఉంది. నాగార్జున తన క్లోజ్ స్నేహితుల్ని మాత్రమే ఆహ్వనించే అవకాశం ఉంది.