Begin typing your search above and press return to search.

పెళ్లిలో శోభిత ఈ లుక్కు చూడ‌నేలేదు

శోభిత ధూళిపాల ఫ్యాష‌న్ సెన్స్, దుస్తుల ఎంపిక ప్ర‌తిదీ యువ‌త‌రంలో వేవ్స్ క్రియేట్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   17 Dec 2024 9:25 AM GMT
పెళ్లిలో శోభిత ఈ లుక్కు చూడ‌నేలేదు
X

శోభిత ధూళిపాల ఫ్యాష‌న్ సెన్స్, దుస్తుల ఎంపిక ప్ర‌తిదీ యువ‌త‌రంలో వేవ్స్ క్రియేట్ చేస్తుంది. చాలా మంది ఔత్సాహిక ఫ్యాష‌న్ ప్రియుల‌కు శోభిత గొప్ప స్ఫూర్తి. ఒక సాధార‌ణ తెలుగు అమ్మాయి.. అసాధార‌ణ ఫ్యాష‌నిస్టాగా ఎలా ఎదిగింది? అన్న‌ది స్ఫూర్తివంత‌మైన ప్ర‌యాణంగా చూస్తారు. డిసెంబర్ 4న నాగ చైతన్యను పెళ్లాడిన శోభితా ధూళిపాళ ఈ పెళ్లి కోసం ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ చీర‌లు, దుస్తులు ప్ర‌జ‌ల‌ క‌ళ్ల‌ను ఆక‌ర్షించాయి. వేడుక ఆద్యంత శోభిత‌ను యూనిక్ స్టైల్ లో నిల‌ప‌డంలో దుస్తుల పాత్ర స‌ముచిత‌మైన‌ది.

ఇప్పుడు ప్రీవెడ్డింగ్ లోంచి కొన్ని బ‌య‌ట‌ప‌డ‌ని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తుంటే అవి అబ్బుర‌ప‌రుస్తున్నాయి. ఫ్యాన్స్ సంబ‌రంగా వాటిని త‌ర‌చి చూస్తున్నారు. తాజాగా సబ్యసాచి డిజైన్ చేసిన కస్టమ్ లెహంగా చోలీ సెట్‌ను ధరించిన ఫోటోషూట్ ఒక‌టి అంత‌ర్జాలంలో దూసుకుపోతోంది. సెలబ్రిటీ డిజైనర్ స‌బ్య‌సాచి ఈ కొత్త ఫోటోలను షేర్ చేసి డిజైన‌ర్ లుక్ వివరాలను షేర్ చేసారు.

టాప్ టు బాట‌మ్ పొడ‌వాటి లెహంగాలో శోభిత ముగ్ధ‌మ‌నోహ‌రంగా క‌నిపిస్తోంది. ఇది చేతితో రూపొందించిన బగ్రూ మల్టీ ప్యానెల్ `చోటు లెహంగా` అని స‌బ్య‌సాచి తెలిపారు. స్కర్ట్ పురాతన జర్దోజీ - చేతితో పెయింట్ చేసిన మిర్రర్ బార్డర్‌లతో అలంకరించారు. చేతితో నేసిన కాటన్ దుపట్టా.. క్లాసిక్ `కాంతి బ్లౌజ్‌`అని వెల్ల‌డించారు. సబ్యసాచి హెరిటేజ్ జువెలరీ నుండి 22k బంగారంతో రూపొందించిన పరండి - ది ఈస్ట్ ఆఫ్ బెంగాల్ చాంద్‌బాలిస్ డిజైన‌ర్ ఆభ‌ర‌ణాలు లుక్ ని మ‌రింత అందంగా మార్చాయి. సబ్యసాచి యాక్సెసరీస్ నుండి అలంకరించిన హ్యాండ్ క్రాఫ్టెడ్ బెల్లీస్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

పెళ్లిలో శోభిత సంప్రదాయ చీరలో వధువు వేష‌ధార‌ణ‌తో అందంగా కనిపించింది. వరుడు నాగ చైతన్య పంచ (ధోతీ) ధరించిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఈ జంట వివాహం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.