కేన్స్ లో శోభిత దుమారం మామూలుగా లేదే!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అట్టహాసంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. రెడ్ కార్పెట్ పై భారతీయ నటీమణుల బ్యూటీకి వరల్డ్ అంతా ఫిదా అవుతుంది.
By: Tupaki Desk | 18 May 2024 9:20 AM GMTకేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అట్టహాసంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. రెడ్ కార్పెట్ పై భారతీయ నటీమణుల బ్యూటీకి వరల్డ్ అంతా ఫిదా అవుతుంది. ఒక్కొక్కరు తమదైన శైలిలో డిజైనర్ దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు. ఈ వేడుకలో తొలిసారి తెలుగు నటి శోభిత దూళిపాళ కూడా భాగమైంది. శోభిత నమ్రత జోషిపూర్ జంప్ సూట్ లో రెడ్ కార్పెట్ పై వాక్ చేసింది. అత్యుత్తమ ఎంపికలో శోభిత తళుక్కున మెరిసింది.
మిరుమిట్లు గొలిపే పర్పుల్ కార్డెలియా జంప్‌సూట్‌లో అద్భుతమైన రూపాన్ని పొందింది. ఔట్‌ఫిట్, స్లీవ్‌లెస్ పీస్, రిచ్, డీప్ పర్పుల్ షేడ్‌లో డిజైనర్ లో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అమ్మడి మ్యాకప్, యాక్సరసీస్ ప్రతీది ఆమె లో బ్యూటీని అంతకంతకు రెట్టింపు చేసింది. ముఖ్యంగా శోభిత రింగు రింగు జుత్తు కేన్స్ లో స్పెషల్ గా హైలైట్ అవుతుంది. సాధారణంగా ఈ తరహా స్టైల్ ని విదేశీ భామలు ఎక్కువగా చూజ్ చేసుకుంటారు.
కానీ ఈసారి ఆ ఛాయిస్ తెలుగు నటి తీసుకోవడం విశేషం. ఈ డిజైనర్ దుస్తులు భారత్ లో తయారు చేయబడింది. దీని ధర 1,80,000 ఉంటుందని అంచనా. గతంలో లాక్మే ఫ్యాషన్ షోలో అతియాశెట్టి సరిగ్గా ఇదే డిజైన్ ధరించి ఆకట్టుకుంది. చిన్న చిన్న మార్పులు తప్ప పెద్దగా ఛేంజెస్ లేవు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. శోభిత డిజైన్ సహా బ్యూటీకి అంతా ఫిదా అవుతున్నారు. తొలిసారే అమ్మడు కేన్స్ ని ఎంతో ఉత్సాహపరించిందంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
శోభిత కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు నుంచి ముంబై వెళ్లి బాలీవుడ్ లో స్థిరపడిన నటి. అలాగని టాలీవుడ్ ని లైట్ తీసుకోలేదు. అవకాశాలు వస్తే ఇక్కడా సినిమాలు చేస్తోంది. హాలీవుడ్ లో కూడా `మంకీ మ్యాన్` తో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ తో కేన్స్ ఉత్సావాలకు ప్రమోట్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో `సితార` అనే సినిమా చేస్తోంది.